ఆర్టీసీ బస్సులో ఓ యువతిపై మూత్ర విసర్జన చేసిన 25 ఏళ్ల యువకుడు.. విమానంలోనే కాదు.. బస్సులోనూ అదే సీన్ రిపీట్..!

ABN , First Publish Date - 2023-02-23T17:58:06+05:30 IST

ఇటీవల ఓ విమానం (plane)లో సభ్యత మరిచిన ఉన్నతోద్యోగి మద్యం మత్తులో మహిళపై మూత్రం పోసిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై నారీమణులంతా తీవ్రంగా మండిపడ్డారు. విమాన సంస్థ కూడా సీరియస్‌గా తీసుకుని అతనిపై చర్యలు తీసుకుంది. ఆ ఘటనను ఇంకా మరువక ముందే

ఆర్టీసీ బస్సులో ఓ యువతిపై మూత్ర విసర్జన చేసిన 25 ఏళ్ల యువకుడు.. విమానంలోనే కాదు.. బస్సులోనూ అదే సీన్ రిపీట్..!
అదే సీన్ రిపీట్..!

ఎంత జ్ఞానం ఉన్న.. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఆ జ్ఞానం వ్యర్థం అంటుంటారు మేధావులు. కళ్లు, కాళ్లు, చేతులు.. ఇవి ప్రతి మనిషికీ ఉంటాయి. దీంట్లో దేన్నీ హీనంగా చూడం. చాలా భద్రంగా కాపాడుకుంటాం. ఇందులో ఇలాంటి సందేహం లేదు. అలాగే స్త్రీ, పురుషులు కూడా నరజాతికి చెందినవారే. ఇందులో ఒకరు ఎక్కువ? ఇంకొకరు తక్కువని ఉండదు. ఇద్దరూ సమానమే. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారంటారు. స్త్రీని సమదృష్టితో చూసినప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆ సమాజం కూడా వర్ధిల్లుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే కొందరు ఉచ్చనీచాలు మరిచి హీనంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడెందుకు ఇదంతా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇటీవల ఓ విమానం (plane)లో సభ్యత మరిచిన ఉన్నతోద్యోగి మద్యం మత్తులో మహిళపై మూత్రం పోసిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై నారీమణులంతా తీవ్రంగా మండిపడ్డారు. విమాన సంస్థ కూడా సీరియస్‌గా తీసుకుని అతనిపై చర్యలు తీసుకుంది. ఆ ఘటనను ఇంకా మరువక ముందే అలాంటి పాడు పనే తాజాగా కర్ణాటకలోని ఓ ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!

మంగళవారం రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు కేఎస్‌ఆర్టీసీ (ksrtc) స్లీపర్ బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో కిరేసూరు దగ్గర ఓ భోజన హోటల్ దగ్గర డ్రైవర్ బస్సును ఆపాడు. దీంతో కొంతమంది కిందకి దిగి వెళ్లిపోయారు. ఇంతలో 28వ సీటులో కూర్చున్న రామప్ప (25) అనే యువకుడు తన సీటు నుంచి లేచి ముందు భాగంలో 3వ సీటులో కూర్చున్న యువతిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా ఖంగుతింది. భయాందోళన చెందిన ఆమె వెంటనే బస్సు దిగి డాబాలో భోజనం చేస్తున్న డ్రైవర్ (Driver), కండక్టర్‌ (Conductor)కు తెలియజేసింది. వెంటనే యువకుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. రామప్ప మెకానికల్ ఇంజనీర్‌గా (Mechanical Engineer) పని చేస్తున్నట్లు అతడు చెప్పాడు. మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని అనుమానించి వదిలిపెట్టేయడంతో బస్సు బయల్దేరి వెళ్లిపోయింది.

ఇది కూడా చదవండి: 24 ఏళ్ల కుర్రాడు.. బరువు 240 కేజీలు.. కేవలం 2 నెలల్లోనే 70 కిలోలు తగ్గిపోయాడు.. అసలు ఈ వింత ఎలా సాధ్యమైందంటే..

Updated Date - 2023-02-23T17:58:07+05:30 IST