ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పిచ్చి పీక్స్ అంటే ఇదే.. రాత్రి పూట కారు పైకి ఎక్కి మరీ ఈ కుర్రాడు చేసిన నిర్వాకం చూస్తే..!

ABN, First Publish Date - 2023-06-01T15:54:22+05:30

ప్రమాదాలు జరగకుండా పోలీసులు అనేక రూల్స్ తీసుకువస్తుంటారు. అలాగే జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తుంటారు. కన్నవారికి కడుపుకోత మిగల్చకుండా ఉండాలని

moving car
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రమాదాలు జరగకుండా పోలీసులు అనేక రూల్స్ తీసుకువస్తుంటారు. అలాగే జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తుంటారు. కన్నవారికి కడుపుకోత మిగల్చకుండా ఉండాలని సూచనలు ఇస్తుంటారు. అయినా కూడా చాలా మంది హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలు పోతాయని తెలుసు కూడా అలానే చేస్తే వాళ్లను ఏమనాలి? అయితే ఇదంతా ఎందుకంటారా? ఈ వీడియో చూశాక మీరే చెప్పండి.

సమయం అర్ధరాత్రి.. ఓ కారు రయ్ మంటూ దూసుకెళ్తోంది. కారు పైకప్పుపై ఓ వ్యక్తి మద్యం సేవిస్తూ నిర్లక్ష్యంగా కనింపించాడు. ఇదిలా ఉంటే అతని స్నేహితులు కూడా కదులుతున్న కారు తలుపులు ఇరువైపులా తెరిచి బయటకు వచ్చి కేరింతలు కొట్టారు. పొరపాటున అటుగా ఎవరైనా వస్తే కచ్చితంగా ప్రమాదంలో పడడం ఖాయం. దీనికి సంబంధించిన దృశ్యాలు అటుగా వెళ్తున్న కొంత మంది ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నా కొందరిలో మార్పు రావట్లేదు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా భయపడటం లేదు. హర్యానాలోని గురుగ్రామ్‌ (Gurugram)లో ఓ వ్యక్తి ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న కారుపైకి ఎక్కి మద్యం సేవించడం (drinks alcohol).. ఇంకోవైపే స్నేహితులు కారు డోర్లలో (moving car ) నుంచి బయటకు వచ్చి చేసిన హంగామా కలకలం రేపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. కారును సీజ్‌ చేసి, నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. కారు యజమానికి రూ.6,500 జరిమానా విధించారు. దీనికి సంబంధించిన వీడియో మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చదవండి: Snake Video: ఇంటి గుమ్మం ముందే మాటు వేసిన పాము.. చూసుకోకుండా ఇంట్లోకి వెళ్లబోయిన చిన్నారి.. లోపల ఉన్నవాళ్లు చెప్పేలోపే..!

Updated Date - 2023-06-01T15:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising