Snake Video: ఇంటి గుమ్మం ముందే మాటు వేసిన పాము.. చూసుకోకుండా ఇంట్లోకి వెళ్లబోయిన చిన్నారి.. లోపల ఉన్నవాళ్లు చెప్పేలోపే..!

ABN , First Publish Date - 2023-06-01T14:36:54+05:30 IST

చాలా మంది పామును చూస్తేనే వణుకుపోతారు. అంతెందుకు చిన్న చిన్న పురుగులు చూసినా భయపడేవారుంటారు. అలాంటిది ఓ పాము సమీపానికి వస్తే ఎలా ఉంటుంది. అమ్మో.. ఇంకేమైనా ఉందా? గుండె

Snake Video: ఇంటి గుమ్మం ముందే మాటు వేసిన పాము.. చూసుకోకుండా ఇంట్లోకి వెళ్లబోయిన చిన్నారి.. లోపల ఉన్నవాళ్లు చెప్పేలోపే..!
Snake Video

చాలా మంది పామును చూస్తేనే వణుకుపోతారు. అంతెందుకు చిన్న చిన్న పురుగులు చూసినా భయపడేవారుంటారు. అలాంటిది ఓ పాము సమీపానికి వస్తే ఎలా ఉంటుంది. అమ్మో.. ఇంకేమైనా ఉందా? గుండె ఆగిపోదు. కానీ ఇది నిజం. ఓ పాము నిజంగానే అత్యంత దగ్గరకు వచ్చేసింది. అది కూడా ఓ చిన్నారి దగ్గరగా వచ్చేసింది. కాటు వేసేందుకు ప్రయత్నించింది. అంతే వారు సడన్‌గా ఎంట్రీ అయ్యారు. ఆ పాప ఏం చేసిందో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సహజంగా పాములు జనావాసాల్లో రావడానికి భయపడుతుంటాయి. అలాంటిది ఓ పాము (Snake) ఏకంగా ఇంటి దగ్గరకే వచ్చేసింది. వేసవి కారణంగా చల్లదనం కోసం వచ్చిందో.. లేదంటే ఇంకెందుకొచ్చిందో తెలియదు గానీ.. ఓ పాము ఏకంగా ఇంటి గుమ్మం (house door)దగ్గరకు వచ్చి బుసలు కొడుతోంది. కానీ అంతలోనే అన్నెంపుణ్యం ఎరుగని ఓ చిన్నారి అప్పుడే అటుగా వస్తోంది(Girl walks). ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అక్కడే నక్కి ఉన్న స్నేక్‌ను గమనించని చిన్నారి ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అంతే కాటు (cobra waiting) వేసేందుకు ప్రయత్నిస్తుండగా అదృష్టవశాత్తు తప్పించుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది.

బెళగావి జిల్లాలో హలగా గ్రామంలోని ఓ ఇంటి గుమ్మం దగ్గర ఓ పెద్ద పాము బుసలు కొడుతోంది. అది గమనించని బాలిక ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు దగ్గరకు రాగానే పాము ఆమెను కాటు వేసేందుకు చూసింది. కొద్దిసేపు గుమ్మం డోర్ దగ్గర నిలబడ్డ ఆ చిన్నారిని.. లోపల ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో ఆమె ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ (Snake Video)గా మారింది.

Updated Date - 2023-06-01T14:36:54+05:30 IST