Viral: కండోమ్స్ ఆర్డర్ ఇచ్చి.. డెలివరీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడు.. కొడుకు ఏం పంపాడా అని ఇంట్లో వాళ్లు ఓపెన్ చేస్తే..!
ABN, First Publish Date - 2023-07-06T11:22:43+05:30
మనం అప్పుడప్పుడు తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ మనకి అనుకోని ఇబ్బందులు తెచ్చి పెడుతుంటాయి.
Viral: మనం అప్పుడప్పుడు తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ మనకి అనుకోని ఇబ్బందులు తెచ్చి పెడుతుంటాయి. ఇక మనం చేసిన తప్పు తెలుసుకునేసరికి సరిదిద్దుకోవడానికి ఏమీ ఉండదు. అప్పుడు ఛా.. అసలు నేను ఇలా ఎలా తప్పు చేశాను అని నాలుక కరుచుకోవడం తప్పా. ఇదిగో ఇదే కోవకు చెందిన ఒక షాకింగ్ అనుభవం ఒక యువకుడికి ఎదురైంది. ఆన్‌లైన్‌లో కండోమ్స్ (Condoms) ఆర్డర్ చేసే క్రమంలో అతడు చేసిన చిన్న తప్పు ఆ యువకుడికి ఇంట్లోవాళ్ల దగ్గర అనుకోని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. యువకుడు చేసిన ఆ తప్పు, దాని పర్యావసనాన్ని అతడి సోదరి ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారంపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ యువకుడు చేసిన తప్పేంటి? ఆ తర్వాత జరిగిన పర్యావసానం ఏంటి?
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ ఎలెనా అనే యువతి తన ట్విటర్ ఖాతా ద్వారా తన సోదరుడు చేసిన తప్పును ప్రస్తావిస్తూ పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం.. ఓ యువకుడు ఆన్‌లైన్ వేదికగా ఇన్‌స్టామార్ట్‌లో (Instamart) కండోమ్ ఆర్డర్ చేశాడు. కానీ, ఆ ఆర్డర్ డెలివరీ తాలూకు అడ్రస్ మార్చడం మరిచిపోయాడు. తాను ఉంటున్న ప్రస్తుత అడ్రస్‌కు బదులుగా తన సొంతింటి అడ్రస్ ఇచ్చాడు. దాంతో డెలివరీ బాయ్.. అతడు ఇచ్చిన ఆ ఇంటి అడ్రస్‌కు డెలివరీ చేసి వెళ్లిపోయాడు. ఆ డెలివరీ కాస్తా యువకుడి తల్లి తీసుకుంది. ఆ తర్వాత కొడుకు ఏం పంపాడా? అని ఇంట్లో వాళ్లు ఆత్రుతగా ఓపెన్ చేశారు. ఇంకేముంది.. అందులో కండోమ్ ప్యాకెట్ దర్శనమిచ్చింది. దాంతో షాక్ అవ్వడం వారి వంతైంది. ఈ విషయాన్ని ఆ యువకుడి సోదరి నెట్టింట పంచుకుంది.
Viral News: అమెరికా మాజీ అధ్యక్షుడి పాత లేఖకు.. వేలంలో దిమ్మతిరిగే ధర..!
"మా అమ్మకి ఇప్పుడే ఇన్‌స్టామార్ట్‌లో ఈ ఆర్డర్ వచ్చింది. పాపం.. మా సోదరుడు అడ్రస్ మార్చడం మర్చిపోయాడు" అనే క్యాప్షన్‌తో ఆర్డర్‌లో వచ్చిన కండోమ్ ప్యాకెట్ తాలూకు ఫొటో తీసి పెట్టింది. దాంతో ఈ పోస్టుపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు మాత్రం అసలు ఈ ఘటన తర్వాత ఏం జరిగిందని సీరియస్‌గా అడిగారు. దీనికి ఎలెనా రిప్లై కూడా ఇచ్చింది. 'ప్రస్తుతం నా బ్రదర్ ఫోన్ పని చేయడం లేదంటూ' చెప్పుకొచ్చింది. ఇక కొందరు 'ప్రస్తుతం మీ బ్రదర్ అడ్రస్ గల్లంతై ఉండాలే' అని అంటే.. ఇంకో నెటిజన్ మాత్రం.. 'అయ్యో.. నిజంగా ఇది పీడ కలనే కదా' అని కామెంట్ చేశారు. ఇప్పటివరకు ఈ పోస్టుకు 5.91లక్షల వ్యూస్ వచ్చాయి.
Abu Dhabi Big Ticket: భారత ప్రవాసుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ.33కోట్లు..!
Updated Date - 2023-07-06T11:28:32+05:30 IST