ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: చలికాలంలో ఉసిరికాయలు ఎందుకు తినాలి? ఈ 10 కారణాల లిస్ట్ చూస్తే..

ABN, First Publish Date - 2023-12-12T12:41:21+05:30

ఉసిరికాయ షడ్రుచులలో కారం మినహా అన్ని రుచులు కలిగి ఉంటుంది. చలికాలంలో దీన్ని తప్పక తినాలని అనడానికి 10 కారణాలు ఇవీ..

ఉసిరి చలికాలంలో అందుబాటులోకి వచ్చే పండు. దీన్ని అమలకి అని కూడా అంటారు. ఉసిరికాయ షడ్రుచులలో కారం మినహా అన్ని రుచులు కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది విటమిన్-సి కి పెద్ద నిధి లాంటిది. యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం తో సహా ఖనిజాలు కూడా ఉంటాయి. ఉసిరికాయలు మామూలుగానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక చలికాలంలో దొరికే దీన్ని చలికాలంలోనే తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ కింది 10 కారణాలు చూస్తే చలికాలంలో ఉసిరి ఎందుకు తినాలో అర్థమవుతుంది.

ఉసిరిలో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి జబ్బులకు చెక్ పెడుతుంది. చలికాలంలో దీన్ని తప్పక తినాలి.

శ్వాసకోశ సమస్యలు నివారించడంలో ఉసిరి ప్రభావవంతంగా ఉంటుంది. ఉబ్బసం, బ్రోన్కైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలకు చికిత్స చేయడానికి ఉసిరి వినియోగిస్తారు.

ఇది కూడా చదవండి: ఈ ఒక్కటి నేర్పిస్తే చాలు.. స్కూల్లో మీ పిల్లలే టాపర్స్!


ఉసిరి సహజంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉండే పైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న పులుపు గుణం అజీర్ణాన్ని నివారిస్తుంది.

యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఉసిరి దగ్గు, జలుబును నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఉసిరిలోని విటమిన్-సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. జుట్టు సంరక్షణలో ఉసిరి ది బెస్ట్.

క్రమం తప్పకుండా ఉసిరిని ఆహారంలో తీసుకుంటూ ఉంటే చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉసిరి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మంటను, చర్మం మీద దద్దుర్లు, చర్మం రంగుతో సహా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో కూడా ఉసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. గ్లూకోజ్ జీవక్రియను నిర్వహిస్తుంది. అకస్మాత్తుగా చక్కెర పెరగడాన్ని నివారిస్తుంది.

వయస్సు సంబంధిత కంటి సమస్యలకు చెక్ పెట్టడంలో ఉసిరి బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి కంటి చూపును మెరుగుపరుస్తాయి.

ఉసిరిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి దీన్ని తీసుకోవాలి. చలికాలంలో దీన్ని తప్పనిసరిగా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకల రుగ్మతలు కూడా నివారించవచ్చు.

విటమిన్-సి కేవలం రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ మాత్రమే కాదు. ది బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫుడ్ కూడా. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అకాల వృద్దాప్యాన్ని నివారిస్తుంది. యవ్వనంగా ఉంచుతుంది.

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలు వేదికలలో పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

ఇది కూడా చదవండి: పిల్లలకు 10 ఏళ్ల వయసొచ్చేలోపే తప్పక నేర్పాల్సిన 10 విషయాలు..!

Updated Date - 2023-12-12T12:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising