ఈ ఒక్కటి నేర్పిస్తే  స్కూల్లో మీ పిల్లలే టాపర్ గా ఉంటారు.

తరగతిలో తమ పిల్లలు టాపర్ గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు.

పిల్లలు టాపర్ గా ఉండాలంటే  చదివే అంశాలను అర్థం చేసుకోమని చెప్పాలి. అది  ఎంత ముఖ్యమో వారికి తెలపాలి.

అర్థం చేసుకోవడం స్కూలు వరకే కాదు భవిష్యత్తులో ఎన్నో విషయాలను సులువు చేస్తుంది.

విషయాన్ని పదే పదే బట్టీ పట్టి గర్తుంచుకోవడం కంటే దాన్ని అర్థం చేసుకోవడం వల్ల పిల్లలలో మానసిక పరిణితి అభివృద్ది చెందుతుంది.

బట్టీ పట్టి చదివే పిల్లలు తొందరగా అలసిపోతారు. కానీ విషయాన్ని అర్థం చేసుకుంటూ చదివే పిల్లలు ఉత్సాహంగా చదువుతారు.

అర్థం చేసుకుని చదవడం వల్ల సిలబస్ చాలా తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు.  పరీక్షలలో సత్తా చాటుతారు.

చదువుకున్న టాపిక్ ను పరీక్షల వరకే కాదు చాలా ఏళ్ళ పాటు ఎప్పుడు అడిగినా చెప్పగలిగేలా  గుర్తుంచుకోగలరు.

పిల్లలు చదువుకునే వాతావరణం చిరాకు పడేలా ఉండకూడదు.