ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: సైకిల్‌కి, చెప్పులకు నిప్పు.. చలిని తట్టుకునేందుకు ఇతడు చేసిన పని చూడండి..

ABN, First Publish Date - 2023-12-09T17:49:19+05:30

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరి తెలివితేటలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి..

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరి తెలివితేటలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చలిని తట్టుకునేందుకు ఓ వ్యక్తి సైకిల్, చెప్పులకు నిప్పు పెట్టాడు. ఇతడు చేసిన పని చూసి నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చలిని తట్టుకునేందుకు విచిత్ర ప్రయోగం చేశాడు. ఇందుకోసం ఇనుప ప్లేట్లలో చెప్పులు తయారు చేశాడు. వాటికి మధ్యలో అర ఏర్పాటు చేసి, అందులో బొగ్గులు పోసి నిప్పు (fire) పెట్టాడు. తర్వాత బయటికి లాగిన అరను మూసేసి కాళ్లకు తొడిగేందుకు వీలుగా తయారు చేశాడు. అలాగే మరోవైపు సైకిల్ (cycle) సీటును కూడా ఇనుప వస్తువులతో తయారు చేశాడు. అందులో కూడా సీటు మధ్యలో ఓ అరను ఏర్పాటు చేశాడు.

Viral Video: వరుడు ఒక్కడే.. వధువులు మాత్రం ఏకంగా నలుగురు.. కనీవినీ ఎరుగని అరుదైన పెళ్లి..!

అందులో కూడా ఇలాగే బొగ్గులు పోసి నిప్పు పెట్టాడు. తద్వారా సైకిల్ సీటు వెచ్చగా ఉండేలా ఏర్పాట్లు చేశాడు. చివరగా సైకిల్ సీటుపై కూర్చుని దూసుకెళ్లిపోతాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘జాగ్రత్త బ్రదర్.. ఫ్యాంట్ కూడా కాలిపోతుందేమో’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు.. ఎక్కడా చూల్లేదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1000కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మనోడి నిర్వాకం చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం.. వంట చేయమంటే ఏకంగా టెంటునే కాల్చేశాడు..!

Updated Date - 2023-12-09T17:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising