ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP : కోటంరెడ్డి వ్యవహారం సద్దుమణగక ముందే.. వైసీపీలో మరో పంచాయితీ.. ఏకంగా జగన్‌నే టార్గెట్ చేస్తూ..!

ABN, First Publish Date - 2023-02-01T19:56:31+05:30

‘వై నాట్‌ 175..? (Why not 175) మొత్తం 175 సీట్లు మనకే ఎందుకు రావు?’ అని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/గన్నవరం : ‘వై నాట్‌ 175..? (Why not 175) మొత్తం 175 సీట్లు మనకే ఎందుకు రావు?’ అని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి (YS Jagan mohan Reddy) ధీమాతో ఉన్నారు. అయితే.. అదంతా మాటల వరకే సరిపోతోంది. వాస్తవానికి రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కుమ్ములాటలు, అవినీతితో వైసీపీ (YSR Congress) కష్టకాలం వచ్చేసిందనే స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ భవిష్యత్ (YSRCP Feature) చిత్రం ఏం బాగాలేదని తేలిపోయింది. ఇప్పటి వరకూ 135 నియోజకవర్గాల్లో అంతర్గత విబేధాలు, 52 మంది ఎమ్మెల్యేలపై (MLAs) అవినీతి ఆరోపణలు, 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను (Sitting Mlas) కేడర్ వద్దంటుండగా.. 42 మందిని మళ్లీ నిలబెడితే గెలుపు గల్లంతే అని వైఎస్ జగన్ (YS Jagan) చేతికి నివేదిక (Report) అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు..

మొన్న ఆనం రాంనారాయణ రెడ్డి.. (Anam Ramnarayana Reddy) నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar reddy).. ఇదంతా నెల్లూరు జిల్లాలో (Nellore) అయితే.. ఇవాళ కృష్ణా (Krishna District) జిల్లా వైసీపీ అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. గన్నవరం (Gannavaram) నియోజకవర్గ వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao), దుట్టా రామచంద్రరావు (Dutta Ramachandrarao) ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు బయటికొచ్చాయి. ఇందులో సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi), కొడాలి నాని (Kodali Nani) పేర్లు కూడా ఉన్నాయి. ఏకంగా వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలే చేశారు. జగన్ రెడ్డి సైకో అని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుట్టా, యార్లగడ్డ ఇద్దరూ మాట్లాడుకున్నారు. జగన్‌ను అందరూ హీరో (Hero) అనుకుంటున్నారు కానీ.. ఆయన సినిమాలో విలన్ (Villain) అని కామెంట్స్ చేశారు దుట్టా, యార్లగడ్డ.

ఆస్తులు ఎక్కడివి..?

ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొడాలి నాని ఏడో తగతి (7th Class) తప్పిన వెధవ అంటూ యార్లగడ్డ, దుట్టా మాట్లాడుకున్నారు. వంశీ, కొడాలి (Vamsi-Kodali) నానికి ఇంత ఆస్తి (Assets) ఎక్కడ్నుంచి వచ్చింది..? ఏ వ్యాపారం (Business) చేసి ఇంత డబ్బు సంపాదించారు..? అని వారు ప్రశ్నించారు. వల్లభనేని వంశీ ఆగడాలను తాము పశ్నించబట్టే ప్రజల్లో గుర్తింపు వచ్చింది అని దుట్టా వ్యాఖ్యనించారు. మీడియాను మేనేజ్ (Media Manage) చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదీ అసలు కథ..!

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ.. యార్లగడ్డపై విజయం సాధించారు. అయితే గెలిచిన కొన్నాళ్లకే టీడీపీకి గుడ్ బై చెప్పేసి జగన్‌కు మద్దతిచ్చారు. వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ.. చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ పోతున్నారు వంశీ. దీంతో ఈ నియోజకవర్గం నుంచి కీలకంగా ఉన్న యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ వంశీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈయన వైసీపీలోకి వస్తున్నారన్న రోజు నుంచే యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ వ్యతిరేకించారు. ఆ తర్వాత పలుమార్లు ఇరువురి అనుచరులు, కార్యకర్తలు కూడా గొడవపడ్డారు. ఈ వ్యవహారం వైఎస్ జగన్ దాకా కూడా వెళ్లింది.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయ్ అనుకుంటూ ఉండగా.. తాజాగా దుట్టా, యార్లగడ్డ సంభాషణ బయటికొచ్చింది. అయితే రానున్న ఎన్నికల్లో వంశీకే వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఇస్తారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు.. యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ టీడీపీకి (Telugudesam) టచ్‌లో ఉన్నారనే వార్తలూ వస్తున్నాయి. అంతేకాదు వంశీకి బ్రేక్ వేయడానికి దుట్టా, యార్లగడ్డను టీడీపీ (TDP) ప్రయోగిస్తోందని కూడా ఈ మధ్యనే వార్తలు వినిపించాయి. అయితే ఈ తాజా వ్యవహారాన్ని అధిష్టానం ఎలా తీసుకోబోతోంది..? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-02-01T21:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising