ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణలో అనూహ్య నిర్ణయం తీసుకున్న అధికారులు..

ABN, First Publish Date - 2023-03-11T18:04:49+05:30

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ( (Delhi Liquor Scam Case)) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు (ED) ప్రశ్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ( (Delhi Liquor Scam Case)) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు (ED) ప్రశ్నిస్తున్నారు. శనివారం నాడు ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం 7 గంటలపాటు కవితను ఈడీ విచారించింది. అయితే ఈ విచారణ సాయంత్రం 6.30 గంటల వరకూ కవితపై ప్రశ్నల వర్షం కొనసాగనున్నట్లు సమాచారం. ఒకవేళ సమయం చాలకపోతే.. మరో రోజు విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించే ఛాన్స్ ఉంది. రేపు ఆదివారం కావడంతో సోమవారం నాడు ఈడీ విచారణకు రావాలని మరోసారి నోటీసులిచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇవాళ సాయంత్రం 5 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. మరో గంటన్నరపాటు ఈడీ ఎదుటే ఉండనున్నారు కవిత.

7 గంటలుగా ఇలా..!

ఇప్పటికే.. కవిత వాడుతున్న పర్సనల్ ఫోన్‌ను (Kavitha Personal Phone) ఇంటి నుంచి తెప్పించి మరీ ఈడీ సీజ్ చేసింది. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయానికి సంబంధించిన.. కీలక సాక్ష్యాలను ముందుంచి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కవిత వాడిన ఫోన్లలోని సమాచారాన్ని ఈడీ ముందుంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ సమయంలో 2 సెల్‌ఫోన్లు, 10 సిమ్‌కార్డులు మార్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్‌లో వాటాలు, రూ.100 కోట్ల ముడుపులపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. లిఖితపూర్వకంగా కూడా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.

ప్రశ్నల వర్షం..!?

ముఖ్యంగా.. స్కామ్‌లో సౌత్ గ్రూప్ పాత్రపై ఎక్కువసేపు విచారించారని సమాచారం. అంతేకాకుండా అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా ప్రశ్నలు అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే కవిత-పిళ్లై ఇద్దర్నీ కాన్‌‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ ద్వారా అధికారులు విచారిస్తున్నారు. కాన్‌‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ అంటే.. కేసుతో సంబంధం ఉన్నవారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం అని అర్థం.

ఇవి కూడా చదవండి..

******************************

Delhi Liquor Case : ఐదు గంటలు పూర్తయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇంకా ఎంతసేపు ఉంటుందంటే...!

******************************

Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవితను విచారిస్తూనే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ.. సిబ్బందిని ఇంటికి పంపి...

Updated Date - 2023-03-11T18:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising