ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR Speech : కేసీఆర్ తొలి ప్రసంగంలోనే పస లేదేం.. సార్‌కు ఏమైందబ్బా..!?

ABN, First Publish Date - 2023-10-15T21:46:05+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. అక్టోబర్-15న ఒక్కరోజే 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేయడం, మేనిఫెస్టోను ప్రకటించడం.. హుస్నాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ తొలి ఎన్నికల సభను నిర్వహించడం జరిగింది...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. అక్టోబర్-15న ఒక్కరోజే 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేయడం, మేనిఫెస్టోను ప్రకటించడం.. హుస్నాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ తొలి ఎన్నికల సభను నిర్వహించడం జరిగింది. 2023 ఎన్నికలకు గులాబీ బాస్‌ది ఇదే తొలి సభ, ప్రసంగం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నాయి. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ పార్టీలపైనే కౌంటర్లు, పంచ్‌లకు కొదువే ఉండదని గులాబీ నేతలు భావించారు.. కానీ ఎందుకో కేసీఆర్ ప్రసంగంలో పసలేదని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే.. కేసీఆర్ సాధారణ ప్రెస్‌మీట్ పెడితేనే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఆయన ఏం మాట్లాడుతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సమరం జరుగుతుండగా.. కేసీఆర్ తొలిసారిగా ప్రసంగించారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఏంటిది..? ఎన్నెన్నో అనుకున్నాం.. సడన్‌గా ఇలా అయ్యిందేంటబ్బా..? అని బీఆర్ఎస్‌లోని కొందరు పెద్దలు ఆలోచనలో పడ్డారట.


ఏదో అనుకుంటే.. ఇంకేదో..!

కేసీఆర్ మీడియా ముందుకు వచ్చినా.. బహిరంగ సభల్లో ప్రసంగించినా ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆయన వేసే పంచ్‌లు, ప్రాసలు, అంతకుమించి కౌంటర్లు.. మధ్య మధ్యలో జోక్‌లు మామూలుగా ఉండవు. అందుకే కేసీఆర్ స్పీచ్ వస్తోందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కిపోతుంటారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి.. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. హుస్నాబాద్ వేదికగా ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన కేసీఆర్.. తొలి ప్రసంగం చేశారు. అయితే ఈ ప్రసంగంలో పస లేదు. వేదికపై ఉన్న గులాబీ నేతలు.. సభకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలు, వీరాభిమానులు కనీసం హడావుడి చేయలేని పరిస్థితి.. ఎందుకంటే కేసీఆర్ ప్రసంగంలో ఆ ఊపు లేదనేది పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న మాట. కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతోందని.. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన చెప్పుకొచ్చారు. అంతే ఇక బీజేపీ గురించి అయితే ఆ ఊసే లేదు. ఈ మధ్యనే తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. కేసీఆర్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబంపై ఏ రేంజ్‌లో విమర్శలు, ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ఈ సభావేదికగా బీజేపీకి గట్టిగా ఇచ్చిపడేస్తారని గులాబీ దళం భావించింది కానీ.. అబ్బే కౌంటర్ సంగతి దేవుడెరుగు.. కనీసం బీజేపీ అనే ప్రస్తావన రాకపోవడం గమనార్హం.

ఏమైంది సారూ..!

కేసీఆర్ ప్రసంగం విన్న, చూసిన పార్టీ శ్రేణులు, ప్రజలంతా సారుకు ఏమైంది..? ఎందుకిలా ఉన్నారు..? బాస్‌లో ఎందుకింత మార్పు వచ్చింది..? అనేదానిపైనే చర్చించుకుంటున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలు అయితే.. అయిపోయింది.. గులాబీ బాస్‌ పని అయిపోయింది..? ఓటమి భయం మొదటి సభ, ప్రసంగంతోనే తేలిపోయిందని చెప్పుకొస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. బీఆర్ఎస్-కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, వీరాభిమానుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఇక రేపో మాపో.. కాంగ్రెస్, బీజేపీ నేతలు మీడియా ముందుకొస్తే ఏ రేంజ్‌లు విమర్శలు ఉంటాయో మరి. అయితే.. ఇప్పుడిప్పుడే కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడుతోందని, అందుకే ప్రసంగం ఇలా సాగిందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతుండగా.. ‘ఇప్పుడే కదా మొదలైంది.. మున్ముందు చూస్తారు కదా బాస్ ఆడే ఆట..’ అంటూ కేసీఆర్ వీరాభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజానిజాలెంతో.. కేసీఆర్‌లో నిజంగా భయం మొదలైందా..? లేకుంటే ఆరోగ్యం సహకరించట్లేదా..? అనేది మరో సభతోనే తేలిపోనుంది.. చూద్దాం ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో!.


ఇవి కూడా చదవండి


TS Polls : కీలక పరిణామం.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు బిగ్ షాట్‌లు.. పార్టీలో చేరకముందే టికెట్ ఫిక్స్..!


BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే.. హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ గమనించారా..?


BRS B-Forms : 119 మంది నియోజకవర్గాలు ఉంటే.. 51 మంది అభ్యర్థులకే కేసీఆర్ ఎందుకు బీ-ఫామ్‌లు ఇచ్చారు..?


TS Assembly Polls : చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి..


KCR Sabha : ప్రజలారా ఆగం కావొద్దు.. ఆలోచించి ఓట్లేయాలి!




Updated Date - 2023-10-15T21:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising