Share News

BRS B-Forms : 119 మంది నియోజకవర్గాలు ఉంటే.. 51 మంది అభ్యర్థులకే కేసీఆర్ ఎందుకు బీ-ఫామ్‌లు ఇచ్చారు..?

ABN , First Publish Date - 2023-10-15T16:40:30+05:30 IST

తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) .. తాజాగా 51 మందికి తెలంగాణ భవన్ వేదికగా బీ-ఫామ్‌లు అందజేశారు. 119 మంది అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫామ్‌లు ఇవ్వొచ్చు.. మరి 51 మందికి మాత్రమే ఎందుకిచ్చారు..? మిగిలినవన్నీ ఎందుకు పెండింగ్ పెట్టారు..?

BRS B-Forms : 119 మంది నియోజకవర్గాలు ఉంటే.. 51 మంది అభ్యర్థులకే కేసీఆర్ ఎందుకు బీ-ఫామ్‌లు ఇచ్చారు..?

తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) .. తాజాగా 51 మందికి తెలంగాణ భవన్ వేదికగా బీ-ఫామ్‌లు అందజేశారు. 119 మంది అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫామ్‌లు ఇవ్వొచ్చు.. మరి 51 మందికి మాత్రమే ఎందుకిచ్చారు..? మిగిలినవన్నీ ఎందుకు పెండింగ్ పెట్టారు..? ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులు చేయబోతున్నారా..? లేకుంటే మరేదైనా ఉందా..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.. బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ వర్గాలు, కేసీఆర్ అత్యంత సన్నిహితుల నుంచి అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. 51 మందికే బీఫామ్‌లు ఇవ్వడం వెనుక పెద్ద కథే నడిచిందని తేలింది. ఇంతకీ ఆ కథేంటి..? ఇంతకీ ఏం జరిగింది..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో చూద్దాం..


brs.jpg

ఇదీ అసలు కథ..

విశ్వసనీయ వర్గాల నుంచి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి అందిన సమాచారం మేరకు.. బీ-ఫామ్‌లు అందజేయడంలో సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌ను వాడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే.. కేసీఆర్ లక్కీ నంబర్ : 06 అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే 51 = 5+1 కదా.. 5+1 = 6 అన్న మాట. అందుకే తన లక్కీ నంబర్ 6 వచ్చేలా ఆదివారం నాడు కేవలం 51మందికి గులాబీ బాస్ బీ- ఫామ్ ఇచ్చారు. ఈ 51 మందిలోనూ అందరూ ముఖ్య నేతలే ఉండటం.. అందులోనూ అన్నీ కీలక నియోజకవర్గాలే ఉన్నాయంటే.. కేసీఆర్ ఎన్ని లెక్కలేసి ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కాగా.. మిగిలిన అభ్యర్థులందరికీ సోమవారం నాడు ఇదే తెలంగాణ భవన్ వేదికగా బీ-ఫామ్‌లు కేసీఆర్ అందజేయనున్నారు. ఇవాళ.. ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజమాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మంకు చెందిన 43మంది అభ్యర్థులకు బీ- ఫామ్‌ను కేసీఆర్ అందజేశారు. వీరితో పాటు.. కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, హరీష్ రావు, నోముల భగత్, క్రాంతి కిరణ్, గూడెం మహిపాల్ రెడ్డి, చల్మడ లక్ష్మి నరసింహరావు, పైళ్ళ శేఖర్ రెడ్డికి బాస్.. బీ-ఫామ్ అందజేశారు. బీఫామ్‌లతో పాటు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చెక్కును కేసీఆర్ అందజేశారు.

బీఫారాలు అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

1. కోనేరు కోనప్ప

2. దుర్గం చిన్నయ్య

3. దివాకర్ రావు

4. కోవా లక్ష్మీ

5. భూక్య జాన్సన్ నాయక్

6. జోగు రామన్న

7. అనిల్ జాదవ్

8. ఇంద్రకరణ్ రెడ్డి

9. విఠల్ రెడ్డి

10. కె చంద్రశేఖర్ రావు

11. షకీల్

12. హనుమంత్ షిండే

13. పోచారం శ్రీనివాస్ రెడ్డి

14. జే సురేందర్

15. బి గణేష్ గుప్తా

16. బాజిరెడ్డి గోవర్ధన్

17. వి ప్రశాంత్ రెడ్డి

18. పట్నం నరేందర్ రెడ్డి

19. ఎస్ రాజేందర్ రెడ్డి

20. డాక్టర్ సి లక్ష్మారెడ్డి

21. ఎ వెంకటేశ్వర్ రెడ్డి

22. వి శ్రీనివాస్ గౌడ్

23. సీహెచ్ రాంమోహన్ రెడ్డి

24. ఎస్ నిరంజన్ రెడ్డి

25. బి కృష్ణామోహన్ రెడ్డి

26. మర్రి జనార్ధన్ రెడ్డి

27. గువ్వల బాలరాజు

28. జైపాల్ యాదవ్

29. అంజయ్య యాదవ్

30. బి హర్షవర్ధన్ రెడ్డి

31. పద్మాదేవేందర్ రెడ్డి

32. ఎం భూపాల్ రెడ్డి

33. చంటి క్రాంతి కిరణ్

34. జి మహిపాల్ రెడ్డి

35. కె ప్రభాకర్ రెడ్డి

36. రేగా కాంతారావు

37. హరిప్రియ నాయక్

38. పువ్వాడ అజయ్ కుమార్

39. కె ఉపేందర్ రెడ్డి

40. ఎల్ కమల్ రాజ్

41. బానోత్ మదన్ లాల్

42. వనమా వెంకటేశ్వరరావు

43. సండ్ర వెంకట వీరయ్య

44. నాగేశ్వరరావు

45. తెల్లం వెంకట్రావు

46. పైళ్ల శేఖర్ రెడ్డి

47. కే తారక రామారావు

48. పల్లా రాజేశ్వర్ రెడ్డి

49. టి హరీష్ రావు

50. ఏ జీవన్ రెడ్డి

51. బాల్క సుమన్

BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే.. హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ గమనించారా..?


Updated Date - 2023-10-15T16:41:20+05:30 IST