Share News

BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే.. హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ గమనించారా..?

ABN , First Publish Date - 2023-10-15T15:32:37+05:30 IST

తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఆదివారం నాడు తెలంగాణ భవన్ (Telangana Bhavan) వేదికగా.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (CM KCR) పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను (BRS Manifesto) రిలీజ్ చేశారు...

BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే.. హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ గమనించారా..?

తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఆదివారం నాడు తెలంగాణ భవన్ (Telangana Bhavan) వేదికగా.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (CM KCR) పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను (BRS Manifesto) రిలీజ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను సైతం అమలు చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనని (BRS) గులాబీ బాస్ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలు, వేరే పార్టీల ఎన్నికల హామీలు, వాటి అమలు తీరుతెన్నులను దృష్టిలో పెట్టుకొని.. అన్నివర్గాలను ఆకర్షించేలా మేనిఫెస్టోలో కీలక హామీలిచ్చారు. గత 2014, 2018 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు 45 రోజుల ముందే కేసీఆర్.. బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా మేనిఫెస్టోను ప్రకటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలే ఉన్నాయి. మేనిఫెస్టో ముందుగా ప్రకటించడం, అందులోనూ అన్నీ సంక్షేమ పథకాలు ప్రకటించడంతో కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఇవి ఏ మాత్రం అమలులోకి వస్తాయో దేవుడెరుగు కానీ.. హామీలు మాత్రం ఓ రేంజ్‌లో ఇచ్చేసింది బీఆర్ఎస్.


BRS.jpg

10 కాదు 100 శాతం..!

‘గత మేనిఫెస్టోలో లేని వాటిని అమలుచేశాం. గత మేనిఫెస్టోలో చెప్పింది 10 శాతం అయితే.. అమలు చేసింది మాత్రం 100 శాతం. అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. రైతుబంధు, దళితబంధును కొనసాగిస్తాం. గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది. గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం. తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం. బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేస్తామని కూడా గులాబీ బాస్ హామీ ఇచ్చారు. కాగా.. ఈ మేనిఫెస్టో ప్రకటనకు ముందు.. 51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్‌ను బాస్ అందజేశారు.

మేనిఫెస్టో ఇదే..

  • రైతుబీమా తరహాలో పేదలకు కేసీఆర్‌ బీమా పథకం

  • తెల్లరేషన్‌కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా

  • కేసీఆర్‌ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది

  • కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా

  • తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ

  • అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం అందిస్తాం

  • పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతాం

  • దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు పెంపు

  • రాష్ట్రంలో మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం

  • అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి

  • అర్హులైనవారికి రూ.400కే గ్యాస్‌ సిలిండర్లు

  • అర్హులైన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్

  • ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు

  • రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు

  • అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తాం

  • అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తాం

  • కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల బీమా పథకం

  • జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు.

పూర్తి మేనిఫెస్టో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Updated Date - 2023-10-15T15:36:24+05:30 IST