Share News

TS Polls : కీలక పరిణామం.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు బిగ్ షాట్‌లు.. పార్టీలో చేరకముందే టికెట్ ఫిక్స్..!

ABN , First Publish Date - 2023-10-15T19:31:04+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నేతలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎక్కడికి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఈసారైనా టికెట్ దక్కుతుందేమో.. అధినేత కనికరిస్తారేమో అని ఎదురుచూసిన నేతలు పార్టీ హైకమాండ్ కనీసం పట్టించుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక పక్కచూపులు చూస్తున్నారు...

TS Polls : కీలక పరిణామం.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు బిగ్ షాట్‌లు.. పార్టీలో చేరకముందే టికెట్ ఫిక్స్..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నేతలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎక్కడికి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఈసారైనా టికెట్ దక్కుతుందేమో.. అధినేత కనికరిస్తారేమో అని ఎదురుచూసిన నేతలు పార్టీ హైకమాండ్ కనీసం పట్టించుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక పక్కచూపులు చూస్తున్నారు. ఎన్నికల ముందు అధికార పార్టీలోకి భారీగానే చేరికలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యమే. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అధికార బీఆర్ఎస్ నుంచి, ప్రతిపక్ష బీజేపీ పార్టీల నుంచి ఊహించని రీతిలో నేతలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఢిల్లీ వేదికగా కండువాలు కప్పుకోగా.. తాజాగా బీజేపీ నుంచి ఒకరు.. బీఆర్ఎస్ నుంచి మరొకరు బిగ్ షాట్‌లు హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంతకీ ఆ పెద్ద తలకాయలు ఎవరు..? కాంగ్రెస్‌లోనే ఎందుకు చేరుతున్నారు..? ఆ ఇద్దరికీ ఆల్రెడీ టికెట్లు కూడా ఫిక్సయ్యాయా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


congress.gif

ఇంతకీ ఎవరు..?

ఆ ఇద్దరు బిగ్ షాట్‌లు మరెవరో కాదండోయ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేతలే. అందులో ఒకరు రేవూరి ప్రకాశ్ రెడ్డి కాగా.. మరొకరు మండవ వెంటేశ్వరరావు. ఈ ఇద్దరూ టీడీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలే. ప్రత్యేక రాష్ట్రం రావడం, ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ బలగం తగ్గడంతో రేవూరి.. బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మండవకు ఇంటికెళ్లి మరీ కేసీఆర్ గులాబీ కండువా కప్పారు. పార్టీలు అయితే మారారు కానీ.. ఏళ్లు గడుస్తున్నా ఈ ఇద్దరికీ ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదనే ఆరోపణలు మాత్రం అభిమానుల నుంచి వస్తున్నాయి. 2023 ఎన్నికల్లో అయినా తమను గుర్తించి టికెట్లు ఇవ్వడం లేకుంటే కనీస ప్రాధాన్యత అయినా పార్టీ పెద్దలు ఇస్తారని భావించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఇక కాషాయ కండువా తీసేయాలని రేవూరి.. కారు దిగేయాలని మండవ భావించారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఒకప్పుడు కలిసి పనిచేసిన తన మిత్రులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టచ్‌లోకి వెళ్లారు.

revuri-prakash-reddy.jpg

టికెట్ ఫిక్స్ అయినట్టే..!

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కండువా కప్పుకోక మునుపే రేవూరి ప్రకాశ్ రెడ్డిని.. కాంగ్రెస్ అభ్యర్థిగా హైకమాండ్ ఖరారు చేసిందని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆయన హవా ఎలా ఉంది..? టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటి..? గెలిచే అవకాశాలు ఏ మాత్రం ఉన్నాయి..? అనే విషయాలను నిశితంగా లెక్కలేసి మరీ అధిష్టానం ఫైనల్ చేసిందని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన్ను రేవంత్, సీనియర్ నేతలు సంప్రదించగా.. పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట. అక్టోబర్-18న ములుగులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభావేదికగా రేవూరి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అయితే కండువా కప్పుకోక ముందే టికెట్ ఫిక్స్ చేశారనే వార్తలు రావడం ఊహించని ట్విస్టేనని చెప్పుకోవచ్చు.

Mandava-and-KCR.jpg

చక్రం తిప్పిన తుమ్మల!

ఇక మండవ వెంకటేశ్వరరావు విషయానికొస్తే.. ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకున్న రేవంత్ స్వయంగా ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మండవ కూడా ములుగు సభలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. మండవ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇరవై ఏండ్లకు పైగా నిజామాబాద్ టీడీపీ జిల్లా పాలిటిక్స్‌ను శాసించిన నేత. టీడీపీ బీఆర్ఎస్‌లో గుర్తింపులేక నాలుగున్నరేండ్ల నుంచి సైలెంట్‌గా ఉండిపోయారు. ఈయన ఖమ్మం జిల్లా కీలకనేత తుమ్మల నాగేశ్వరరావుకు దగ్గరి బంధువు. బీఆర్ఎస్‌లో పరిస్థితులు సర్లేకపోవడంతో తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే మండవను కూడా తుమ్మల కాంగ్రెస్‌లో చేరమని మంతనాలు జరిపారట. అందుకే.. రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. కాగా.. మండవ వస్తే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్​మరింత బలపడుతోందని, ఎన్నికల నేపథ్యంలో మరింత కలిసొస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మండవకు అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మొత్తానికి చూస్తే.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి మాత్రం చేరికలు భారీగానే సాగుతున్నాయ్. మరి ఏమాత్రం ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.

revanth-reddy.jpg


ఇవి కూడా చదవండి


BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే.. హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ గమనించారా..?


BRS B-Forms : 119 మంది నియోజకవర్గాలు ఉంటే.. 51 మంది అభ్యర్థులకే కేసీఆర్ ఎందుకు బీ-ఫామ్‌లు ఇచ్చారు..?


TS Assembly Polls : చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి..


KCR Sabha : ప్రజలారా ఆగం కావొద్దు.. ఆలోచించి ఓట్లేయాలి!




Updated Date - 2023-10-15T19:38:36+05:30 IST