Share News

TS Assembly Polls : చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి..

ABN , First Publish Date - 2023-10-15T17:16:26+05:30 IST

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా రోజుల తర్వాత బహిరంగ సభలో ప్రసంగం చేస్తున్నారు. వైరల్ ఫీవర్‌ నుంచి కోలుకున్న తర్వాత బాస్ తొలి ప్రసంగం చేస్తున్నారు..

TS Assembly Polls : చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి..

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా రోజుల తర్వాత బహిరంగ సభలో ప్రసంగం చేస్తున్నారు. వైరల్ ఫీవర్‌ నుంచి కోలుకున్న తర్వాత బాస్ తొలి ప్రసంగం చేస్తున్నారు. అందులోనూ 2023 అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ చేస్తున్న తొలి ప్రసంగం ఇదే. దీంతో హుస్నాబాద్ వేదికగా గులాబీ బాస్ ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ప్రసంగం కోసం ఓ వైపు రాష్ట్ర ప్రజలు.. మరోవైపు రాజకీయ పార్టీలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ ప్రజలు, కేసీఆర్ వీరాభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు టీవీలకు అతుక్కుపోయారు.


KCR-Sabha-F.jpg

ఏం మాట్లాడుతారో..?

ఈ సభా వేదికగా.. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తారా..? లేదా..? అనేది రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే అని.. మరోవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సభా వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు..? ఈ మధ్యనే ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరూ తెలంగాణ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్‌ను, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ, షా ప్రసంగంపై మాట్లాడి కౌంటరిస్తారా లేదా అని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ను ఎలా టార్గెట్ చేయబోతున్నారు..? విమర్శలు కొనసాగిస్తారా.. సైలెంట్ అవుతారా..? అనేది చూడాలి. కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నన్ని రోజులూ రాజకీయ ప్రసంగంపై బీఆర్ఎస్ పెద్దలు కొందరు తెలంగాణ భవన్, ఫామ్‌ హౌస్ వేదికగా రాజకీయ ప్రసంగంపై తీవ్ర కసరత్తులు చేసినట్లు సమాచారం.

Updated Date - 2023-10-15T17:20:58+05:30 IST