Canada: మానిటోబా ప్రావిన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైల హవా..!
ABN, First Publish Date - 2023-10-06T11:59:20+05:30
ఉపాధి, వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు (Indians) ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. భారత సంతతి ప్రాబల్యం క్రమంగా పెరగడంతో ఏకంగా అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు.
Canada: ఉపాధి, వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు (Indians) ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. భారత సంతతి ప్రాబల్యం క్రమంగా పెరగడంతో ఏకంగా అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇక భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో కెనడా (Canada) కూడా ఒకటి. దశాబ్దాల క్రితం నుంచే మనోళ్లు ఈ దేశంలో స్థిరపడ్డారు. అటు కెనడియన్ రాజకీయాల్లోనూ భారతీయుల ప్రాబల్యం గురించి ఎంత చెప్పిన తక్కువే. అన్ని పార్టీల్లోనూ, చివరికి ప్రభుత్వంలోనూ ఇండో-కెనడియన్లు (Indo-Canadians) కీలక పదవులు నిర్వహిస్తున్నారు.
అంతేందుకు ప్రస్తుతం కెనడాలో అధికారంలో ఉన్న జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సైతం భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ (Jagmeet Singh) సారథ్యంలోని 'న్యూ డెమొక్రాటిక్ పార్టీ' మద్ధతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మానిటోబా ప్రావిన్షియల్ అసెంబ్లీ (Manitoba provincial assembly) ఎన్నికల్లోనూ మనోళ్ల హవా కొనసాగింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు భారత సంతతి నేతలు విజయం సాధించారు. ఈ ముగ్గురు కూడా సిక్కు వ్యక్తులే. బర్రోస్ (Burrows) నుంచి దిల్జీత్ బ్రార్ (Diljit Brar), ది మాపుల్స్ (The Maples) నుంచి మింట్ సంధు (Mint sandhu), మెక్ ఫిలిప్స్ (Mc Phillips) నుంచి జస్దీప్ దేవగన్ (Jasdeep Devgan) గెలుపొందారు.
అలాగే ముగ్గురూ న్యూ డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారే కావడం విశేషం. ఇక బ్రార్, సంధు ఇద్దరూ కేబినెట్ పదవి రేసులో ఉన్నారని సమాచారం. మొత్తం తొమ్మిది మంది పంజాబీ మూలాలున్న నేతలు మానిటోబా ప్రావిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగగా, మిగతా ఆరుగురు ఓటమి పాలయ్యారు. నవ్‌రాజ్ బ్రార్ (బర్రోస్), సుమిత్ చావ్లా (ది మాపుల్స్), కిర్ట్ హేయర్ (సెయింట్ బోనిఫేస్), పరమ్‌జిత్ షాహి (ఫోర్ట్ రిచ్‌మండ్), మంజిత్ కౌర్ గిల్ (వేవర్లీ ), అమర్‌జిత్ సింగ్ (సౌత్‌డేల్) పోటీచేసి ప్రత్యర్ధుల చేతిలో పరాజయం పొందారు.
Emirates Draw: ప్చ్.. సింగిల్ డిజిట్ తేడాతో భారతీయుడికి రూ.226కోట్ల జాక్‌పాట్ మిస్..!
Updated Date - 2023-10-06T11:59:20+05:30 IST