ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kamala Harris: కమలా హ్యారిస్ పేరిట మరో అరుదైన రికార్డ్.. 191 ఏళ్ల అగ్రరాజ్యం చరిత్రలో ఇదే తొలిసారి..

ABN, First Publish Date - 2023-07-14T11:41:10+05:30

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ (Kamala Harris) తాజాగా మరో అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ (Kamala Harris) తాజాగా మరో అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నారు. భారత సంతతికి చెందిన కల్పనా కోటగల్‌ (Kalpana Kotagal) ను యూఎస్ సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ సభ్యురాలిగా నియమించే విషయంలో కమలా టై-బ్రేకింగ్ ఓటు (Tie-Breaking Vote) హక్కును వినియోగించుకున్నారు. యూఎస్ సెనేట్‌ (Senate) లో బుధవారం ఓటింగ్ జరిగింది.

కల్పనా కోటగల్‌ను నియమించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దాంతో ఉపాధ్యక్షురాలిగా కమలా టై-బ్రేకింగ్ ఓటు వేశారు. ఇక అగ్రరాజ్యం చరిత్రలో ఉపాధ్యక్షుడు ఇలా టై-బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది 191 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, 1825-1832 మధ్య కాలంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన జాన్ క్విన్సీ ఆడమ్స్ (John Quincy Adams), ఆండ్రూ జాక్సన్ (Andrew Jackson) ఇద్దరికీ సౌత్ కరోలినాకు చెందిన జాన్ సి. కాల్హౌన్ (John C. Calhoun) వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో దాదాపు ఎనిమిదేళ్లలో 31 టై-బ్రేకింగ్ ఓట్లను వేశారాయన. అలా కాల్హౌన్ తర్వాత మళ్లీ ఇప్పుడు (191 ఏళ్ల తర్వాత) కమలా హ్యారిస్ టై-బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Visa Fees: బ్రిటన్‌ వెళ్లే విదేశీయులకు షాక్.. వీసా ఫీజులపై రిషి సునాక్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated Date - 2023-07-14T11:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising