Visa Fees: బ్రిటన్‌ వెళ్లే విదేశీయులకు షాక్.. వీసా ఫీజులపై రిషి సునాక్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-07-14T07:31:38+05:30 IST

బ్రిటన్‌కు వచ్చే విదేశీయుల నుంచి వసూలు చేసే వీసా పీజును పెంచుతూ రిషి సునాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Visa Fees: బ్రిటన్‌ వెళ్లే విదేశీయులకు షాక్..  వీసా ఫీజులపై రిషి సునాక్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

బ్రిటన్‌ వీసా ఫీజుల పెంపు

హెల్త్‌ సర్‌ఛార్జీ కూడా.. వేతనాల పెంపు కోసమే: సునాక్‌

లండన్‌, జులై 13: బ్రిటన్‌కు వచ్చే విదేశీయుల నుంచి వసూలు చేసే వీసా పీజును పెంచుతూ రిషి సునాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీసుకు చెల్లించాల్సిన హెల్త్‌ సర్‌ఛార్జీని కూడా పెంచింది. ఉద్యోగుల జీతాలను 5-7 శాతం మేర పెంచాల్సి ఉండడంతో ఆ భారాన్ని భరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని సునాక్‌ చెప్పారు. అధిక జీతాల కోసం రుణాలు తీసుకుంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందని తెలిపారు. పన్నులను కూడా పెంచాలని అనుకోవడం లేదని చెప్పారు. అదనపు వ్యయానికి నిధులు ఇతర చోట్ల నుంచి రావాల్సి ఉందని, అందుకే వీసా ఫీజులు, ఇమిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌ఛార్జీ (ఐహెచ్‌ఎ్‌స) పెంచినట్టు వివరించారు. దీనివల్ల ఒక బిలియన్‌ పౌండ్లు (సుమారు రూ.17,000 కోట్లు) సమకూరుతుందని చెప్పారు. ఏ వర్గం వారు ఎంత చెల్లించాలన్న దానిపై మరికొన్ని నెలల్లో హోం శాఖ వివరాలు విడుదల చేయనుంది.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

Updated Date - 2023-07-14T07:31:38+05:30 IST