ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: ఓహియోలో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం

ABN, First Publish Date - 2023-10-26T07:16:22+05:30

అప్రజాస్వామ్యంగా అరెస్టయ్యి గత 44 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో నిర్బంధంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో వెంటనే విడుదల కావాలని కాంక్షిస్తూ అమెరికాలోని ఓహియో రాష్ట్రం కొలంబస్ పట్టణంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చంద్రబాబు గోత్రనామాలతో ఎన్నారైలు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కొలంబస్ పట్టణంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం

NRI: అప్రజాస్వామ్యంగా అరెస్టయ్యి గత 44 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో నిర్బంధంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో వెంటనే విడుదల కావాలని కాంక్షిస్తూ అమెరికాలోని ఓహియో రాష్ట్రం కొలంబస్ పట్టణంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చంద్రబాబు గోత్రనామాలతో ఎన్నారైలు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు, తెలుగేతర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కుటుంబ సమేతంగా పాల్గొని చంద్రబాబు కోసం భక్తిశ్రద్ధలతో మనసారా ప్రార్థించారు. గత 45 సంవత్సరాలుగా ప్రతిక్షణం ప్రజల కోసం పాటుపడుతూ సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు కోసం ఈనాడు ప్రపంచమంతా ముఖ్యంగా తెలుగువారు ఆయన రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం చరిత్రలో ఒక చీకటి ఘట్టం. గత 45 రోజులుగా ప్రపంచమంతా ఏదో ఒక చోట ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆయన తొందరగా బయటికి రావాలని ఆకాంక్షిస్తూ న్యాయస్థానంలో సత్వర న్యాయం జరగాలని కోరుతున్నారు.

Updated Date - 2023-10-26T07:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising