ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ప్రవాసులే అతని టార్గెట్.. కువైటీ నిర్వాహకానికి బిత్తరపోయిన డిటెక్టివ్ అధికారులు..!

ABN, First Publish Date - 2023-03-05T08:59:30+05:30

ప్రవాసులను (Expats) లక్ష్యంగా చేసుకుని గతకొంత కాలంగా దోపిడీలకు పాల్పడుతున్న కువైత్ పౌరుడిని (Kuwait Citizen) ఆ దేశ డిటెక్టివ్ అధికారులు తాజాగా సాల్మియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కువైత్ సిటీ: ప్రవాసులను (Expats) లక్ష్యంగా చేసుకుని గతకొంత కాలంగా దోపిడీలకు పాల్పడుతున్న కువైత్ పౌరుడిని (Kuwait Citizen) ఆ దేశ డిటెక్టివ్ అధికారులు తాజాగా సాల్మియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వలసదారులను దోచుకోవడానికి కువైటీ ఏకంగా డిటెక్టివ్‌గా (Detective) నటించాడు. పోలీసుల పట్ల బాధితులకు ఉన్న భయాన్ని అవకాశంగా తీసుకుని పది దోపిడీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. ఇక సదరు కువైటీని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడిపై ఫిర్యాదు చేసిన పలువురు ప్రవాసులు నిందితుడిని గుర్తించారు. కాగా, అతడు తన ఈ నేరాలకు నకిలీ ఐడీని (ID) ఉపయోగించినట్లు అధికారులు తేల్చారు. అనంతరం చట్టపరమైన చర్యల కోసం అతడిని ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.

దాదాపు పది మంది ప్రవాసులు గత కొంతకాలంగా ఓ వ్యక్తి తమను భయపెట్టి దోపిడీకి పాల్పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. డిటెక్టివ్ అని చెప్పుకునే గుర్తు తెలియని ఆ వ్యక్తి ప్రవాసులను నిర్బంధించి ఆపై వారి వద్ద నుంచి డబ్బు, ఫోన్‌లను దోచుకుంటున్నాడు. అలా వలసలదారుల ద్వారా ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆ తరువాత నిందితుడిని అరెస్టు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల పాటు సదరు వ్యక్తి కోసం వేచి చూశారు. తాజాగా ఆ నకిలీ డిటెక్టివ్‌ను అధికారులు సాల్మియా ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: మీకు టూరిస్ట్ వీసా ఉంటే చాలు.. కెనడాలో రెండేళ్లు ఎంచక్కా పని చేసుకోవచ్చు..!

Updated Date - 2023-03-05T08:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising