ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో..

ABN, First Publish Date - 2023-02-11T09:03:16+05:30

అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా. దానిలో భాగంగా క్రమం తప్పకుండా లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారి అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. అలాంటిది రెండు నెలల వ్యవధిలోనే రెండు లాటరీలు గెలిస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇదిగో ఖతార్‌లో ఉండే ఈ భారతీయ ప్రవాసుడి (Indian Expat) విషయంలో అదే జరిగింది. రెండుల నెలల కింద బిగ్ టికెట్ ఎలక్ట్రానిక్ డ్రాలో (Big Ticket Draw) 1కిలో గోల్డ్ గెలుచుకున్న మనోడు.. తాజాగా నిర్వహించిన డ్రాలో విలువైన మోడ్రన్ కారు గెలుచుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్లే.. సుమన్ ముత్తయ్య నాడార్ రాగవన్ (Suman Muthaiah Nadar Ragavan) అనే భారత వ్యక్తి ఖతార్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా మిత్రుల సలహా మేరకు క్రమం తప్పకుండా బిగ్ టికెట్ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. దీంతో గతేడాది డిసెంబర్‌లో మనోడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏకంగా 1కేజీ గోల్డ్ గెలుచుకున్నాడు. మళ్లీ ఇప్పుడు మనోడికి మరోసారి అదృష్టం వరించింది. ఇటీవల అతడు కొన్న ఓ లాటరీకి తాజాగా నిర్వహించిన డ్రాలో రేంజ్ రోవర్ (Range Rover) వచ్చింది. ఇలా రెండు నెలల వ్యవధిలోనే సుమన్ ముత్తయ్య బిగ్ టికెట్ ద్వారా రెండు బంఫర్ ప్రైజ్‌లు కొట్టేశాడు. దీంతో మనోడి ఆనందానికి అవధుల్లేవు. మునుముందు కూడా ఇలాగే ప్రతినెల బిగ్ టికెట్ రాఫెల్‌లో (Big Ticket Raffle) పాల్గొంటూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: భారత పౌరసత్వాన్ని వదులుకున్న 16 లక్షల మంది.. పదేళ్ల రికార్డ్ బ్రేక్!

Updated Date - 2023-02-11T09:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising