ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait News: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. కువైత్‌లో ఉండగా ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే!

ABN, First Publish Date - 2023-12-06T08:30:31+05:30

NRI News: గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న తప్పులకు కూడా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. ఇక పెనాల్టీలు కూడా అదే స్థాయిలో భారీగానే ఉంటాయి. అందుకే ఆ దేశాలకు వెళ్లేముందు అక్కడి నియమనిబంధనలపై ఎంతోకొంత అవగాహన ఉండడం తప్పనిసరి.

NRI News: గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న తప్పులకు కూడా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. ఇక పెనాల్టీలు కూడా అదే స్థాయిలో భారీగానే ఉంటాయి. అందుకే ఆ దేశాలకు వెళ్లేముందు అక్కడి నియమనిబంధనలపై ఎంతోకొంత అవగాహన ఉండడం తప్పనిసరి. లేనిపక్షంలో భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మనకు తెలియకుండా చేసే పొరపాటు సైతం మనల్ని కటకటాలపాలు చేయొచ్చు. అలాగే లక్షల్లో జరిమానా కట్టాల్సి రావొచ్చు. ఇక గల్ఫ్ దేశాల్లో ఒక్కటైన కువైత్‌‌లో తాజాగా జరిమానాలు, శిక్షలకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది అక్కడి సర్కార్. దీనిలో భాగంగా అక్కడ ఇటీవల కొన్ని కొత్త పెనాల్టీలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కువైత్‌లోని ప్రవాసులు జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం.

ఇది కూడా చదవండి: విషాదం.. స్విమ్మింగ్ పుల్‌లో మునిగి ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన!

అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్విరాన్‌మెంటల్ పోలీస్ విభాగం (Environmental Police Department) క్యాంపస్‌లలో ఉండేవారికి కీలక సూచన చేసింది. ముఖ్యంగా స్కూల్స్, యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌‌ల పరిధిలలో ధూమపానం చేయకూడదు. ఒకవేళ ఇలా చేస్తే రూ. 13,493 నుంచి రూ. 26,986 జరిమానా ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే లిజార్డ్స్, పక్షులను వేటాడితే 250 కువైటీ దినార్లు (రూ.67,465) పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. ఇక లైసెన్స్ లేకుండా కువైత్‌ బే (Kuwait Bay) లో చేపల వేటను కూడా నిషేధించినట్లు వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా లైసెన్స్ లేకుండా చేపలు పట్టడం చేస్తే ఏకంగా 1250 కేడీలు (రూ. 3.37లక్షలు) ఫైన్ ఉంటుందని తెలిపారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఈ సూచనలకు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు కోరారు.

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T08:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising