ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: లండన్‍లోని భారతీయ కుటంబంలో విషాదాన్ని మిగిల్చిన దీపావళి వేడుకలు.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి!

ABN, First Publish Date - 2023-11-15T09:34:14+05:30

లండన్‍లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.

ఎన్నారై డెస్క్: లండన్‍లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు (Diwali celebration) విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. లండన్ ఫైర్ బ్రిగేడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 10.26 గంటలకు (లండన్ కాలమానం ప్రకారం) హౌన్స్‌లోలోని ఛానల్ క్లోజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను ఆర్పేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు, సుమారు 70 మంది అగ్నిమాపక సిబ్బంది కష్టపడాల్సి వచ్చిందని బ్రిగేడ్ తెలిపింది. స్థానిక మిడ్ టెర్రస్ ఉన్న ఇంటి గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులు మంటలకు కాలిపోయాయి.

Indian Students: గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. యూఎస్ వర్సిటీల్లో భారీగా పెరిగిన విదేశీ విద్యార్థులు.. మనోళ్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ ప్రమాద సమయంలో భవనం మొదటి అంతస్తులో ఉన్న ఐదుగురు వ్యక్తులు సజీవదహనం అయినట్లు బ్రిగేడ్ వెల్లడించింది. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉండగా, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నామని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. అత్యవసర సిబ్బంది వచ్చేలోపు ఒక వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం పొగలు కనిపించాయని ఆ ప్రాంత నివాసితులు చెప్పారు. అయితే అది దీపావళి బాణాసంచాకు సంబంధించినదా? అనే విషయాన్ని ధృవీకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

UAE: విమాన టికెట్స్ నుంచి ట్రాఫిక్ ఫైన్స్ వరకు.. ఇలా యూఏఈలో 5 విషయాలలో వాయిదాలలో చెల్లించే సౌకర్యం


ఇక ఘటనాస్థలిలో చీఫ్ సూపరింటెండెంట్ సీన్ విల్సన్ విలేకరులతో మాట్లాడారు. "మాతో పాటు స్పెషలిస్ట్ ఫైర్ ఆఫీసర్లు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇది బయటివారి పనినా? లేక ఇంట్లోవారే ఏదైనా ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది" అని అన్నారు. అయితే, ఆలయానికి వెళ్లే మార్గంలో వీధి గుండా వెళుతున్న ఆశిష్ సోస్నియా అనే భారతీయ వ్యక్తి ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఒక గంటపాటు బాణాసంచా కాల్చడం చూశానని చెప్పారు. ఈ ఘటనపై లండన్ అగ్నిమాపక కమిషనర్ ఆండీ రో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఇది చాలా విచారకరమైన సంఘటన. లండన్ ఫైర్ బ్రిగేడ్‌లోని మా సిబ్బంది ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబం, స్నేహితులకి సానుభూతి తెలుపుతున్నాం" అని అన్నారు.

UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!

Updated Date - 2023-11-15T09:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising