Share News

UAE: విమాన టికెట్స్ నుంచి ట్రాఫిక్ ఫైన్స్ వరకు.. ఇలా యూఏఈలో 5 విషయాలలో వాయిదాలలో చెల్లించే సౌకర్యం

ABN , First Publish Date - 2023-11-15T08:45:38+05:30 IST

అనుకోకుండా వచ్చిపడే ఖర్చులను నిలువరించడం అంత ఈజీ కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. నెలవారీగా నిర్ణయించుకున్న వ్యయం కంటే ఒక్కసారిగా పెరిగిన ఖర్చులు అప్పుడప్పుడు మనల్ని తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి కూడా.

UAE: విమాన టికెట్స్ నుంచి ట్రాఫిక్ ఫైన్స్ వరకు.. ఇలా యూఏఈలో 5 విషయాలలో వాయిదాలలో చెల్లించే సౌకర్యం

అబుదాబి: అనుకోకుండా వచ్చిపడే ఖర్చులను నిలువరించడం అంత ఈజీ కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. నెలవారీగా నిర్ణయించుకున్న వ్యయం కంటే ఒక్కసారిగా పెరిగిన ఖర్చులు అప్పుడప్పుడు మనల్ని తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి కూడా. అలాంటి సమయంలో ఒక్కొసారి సేవింగ్స్‌కు కూడా చిల్లు పడుతుంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో లోన్స్ తీసుకుంటాం. అయితే, యూఏఈలో డైలీ రోటీన్ విషయాలకు అయ్యే ఖర్చులకు కూడా అక్కడి సంస్థలు వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ప్రాపర్టీల కొనుగోళ్లకు మాత్రమే కాకుండా చిన్న చిన్న సందర్భాలలో వచ్చే ఊహించని వ్యయాలకు కూడా అక్కడి బ్యాంకులు జీరో పర్సెంట్ వడ్డీతో వాయిదాలలో చెల్లించే సౌకర్యం కల్పిస్తున్నాయి. మూడు, ఆరు, పన్నెండు, ఇరవై నాలుగు నెలల వ్యవధితో ఈ వాయిదాలు (Instalments) వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. విమాన టికెట్ల బుకింగ్ నుంచి ట్రాఫిక్ జరిమానాల వరకు.. ఇలా యూఏఈలో ప్రధానంగా 5 విషయాలలో వాయిదాలలో చెల్లించే వెసులుబాటు ఉంది. అవేంటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం..

Indian Students: గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. యూఎస్ వర్సిటీల్లో భారీగా పెరిగిన విదేశీ విద్యార్థులు.. మనోళ్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!


1. విమాన టికెట్లు

మీరు ఏదైనా ఎమర్జెన్సీ కారణంగా బయటకు వెళ్లినా లేదా మీరు ఒకేసారి పెద్ద ట్రిప్‌ని బుక్ చేసినా సందర్భంలో విమాన ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం ఒకేసారి అంత భారీ మొత్తాన్ని చెల్లించడం వీలుపడకపోవచ్చు. అయితే, మీరు ఇప్పుడు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని యూఏఈ ఎయిర్‌లైన్‌లు కస్టమర్‌లకు ఇప్పుడు విమాన టికెట్స్ బుకింగ్‌లపై 'డౌన్ ది లైన్' చెల్లించే సౌలభ్యాన్ని అందించడానికి బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఎమిరేట్స్ విమాన టిక్కెట్లను కనీసం 10 బ్యాంకుల కస్టమర్లకు సున్నా వడ్డీతో మూడు నెలవారీ వాయిదాలలో చెల్లించే సౌకర్యం ఉంది. ఫ్లైదుబాయి (Flydubai) 3 నుండి 6 నెలల వాయిదాలను అందించడానికి రెండు బ్యాంకులతో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ (Etihad Airways) వీసా, మాస్టర్ కార్డ్ వినియోగదారుల కోసం ఇలాంటి పథకాలను అనుమతిస్తుంది. ఇక ఎయిర్ అరేబియా (Air Arabia) అయితే కొంతమంది ప్రయాణీకులకు ఈ చెల్లింపుల కోసం రెండు సంవత్సరాల వరకు వాయిదాలు అందిస్తోంది. అనేక ట్రావెల్ ఏజెన్సీలు ఇటువంటి ఆప్షన్లను అందిస్తాయి.

2. ట్రాఫిక్ జరిమానాలు

బడ్జెట్ పరిగణనలలో అరుదుగా వచ్చే ఖర్చులలో జరిమానాలు కూడా ఉన్నాయి. వీటి తాలూకు హెచ్చరికతో కూడిన సందేశం వచ్చినప్పుడు మనం ముందుగా ప్లాన్ చేసుకున్న కొన్ని విషయాలను పక్కన బెట్టాల్సి వస్తుంది. ఇలా పెనాల్టీ చాలా ఎక్కువగా ఉంటే.. దానిని సులభంగా వాయిదాలలో చెల్లించే వెసులుబాటు ఉంది. దీనికోసం వివిధ ఎమిరేట్‌లలోని అధికారులు వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (DRTA) నివాసితులు వారి క్రెడిట్ కార్డ్‌ల ద్వారా సున్నా వడ్డీతో ఒక సంవత్సరం పాటు జరిమానాలను చెల్లించడానికి అనుమతిస్తుంది. అయితే, అన్ని బ్యాంకులు దీన్ని కవర్ చేయవు. కాబట్టి మీ బ్యాంక్ ప్రొవైడర్‌ వద్ద ఈ విషయంలో తనిఖీ చేయడం బెటర్. ప్రజలు తమ బ్యాంకులను బట్టి 3, 6 లేదా 12 నెలల్లో ట్రాఫిక్ జరిమానాలు చెల్లించవచ్చు. ఇక అబుదాబి పోలీసులు అనేక బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. కావున ఎమిరేట్‌లోని డ్రైవర్లు ఒక సంవత్సరంలోపు వాయిదాలలో జరిమానాలను చెల్లించే వెసులుబాటు ఉంది.

UAE Golden Visa: యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసాతో బోలెడు బెనిఫిట్స్.. నివాసం నుంచి వ్యాపారం వరకు ప్రవాసులకు కలిగే ప్రయోజనాలివే..!

3. స్కూల్ ఫీజు

పాఠశాలలు నెలవారీ చెల్లింపు పథకాలను అందిస్తున్నప్పటికీ, బ్యాంకులు ఇప్పటికీ వాయిదాల ఆప్షన్స్‌ను అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్‌తో తల్లిదండ్రులు పూర్తి చెల్లింపులు చేయడం కోసం పాఠశాలలు డిస్కౌంట్లను అందించవచ్చు కాబట్టి ఇది మరింత ఆచరణాత్మకమైనది. ట్యూషన్ ఫీజును సెటిల్ చేయడానికి వారి కార్డ్‌లను స్వైప్ చేయడం ద్వారా, వారు స్కూల్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంకు యొక్క నెలవారీ చెల్లింపు స్కీమ్‌ను జీరో వడ్డీకి పొందవచ్చు. అయితే, అన్ని బ్యాంకులు అన్ని పాఠశాలలను దీన్ని కవర్ చేయవు. అలాగే నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. ఈ విషయంలో మీ బ్యాంక్, మీరు సైన్‌అప్ చేస్తున్న విద్యా సంస్థలో ముందే తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

4. కారు బీమా

అవును కారు భీమా వ్యవయం కూడా ఏడాదికి 4వేల దిర్హమ్స్ (సుమారు రూ.90వేలు) కు మించి ఉండవచ్చు. దీన్ని కూడా నెలవారీ చెల్లింపులుగా విభజించుకోవచ్చు. అయితే, దీనిపై వడ్డీ రహిత పథకాలను అందించే ప్రొవైడర్ల సంఖ్య పరిమితంగా ఉండొచ్చు. దీనిలో భాగంగా 3 నుండి 6 నెలల ప్లాన్‌ల కోసం నాలుగు బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకున్న వాటిలో ఆర్ఎస్ఏ (RSA) బీమా ఒకటి. కొన్ని ఇతర చెల్లింపు గేట్‌వేలతో పాటు టాబ్బీ (Tabby) వంటివి నాలుగు నెలల్లో చెల్లించడానికి క్లయింట్‌లను అనుమతిస్తాయి.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

5. యుటిలిటీ బిల్లులు

ఊహించని వ్యయాన్ని కవర్ చేయడానికి మీరు బడ్జెట్‌లో కొంత స్థలాన్ని ఖాళీ చేయాల్సిన సమయంలో యుటిలిటీ బిల్లు చెల్లింపులను వాయిదా వేయవచ్చని గుర్తుంచుకోండి. దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా) కస్టమర్‌లు ఎమిరేట్స్ ఎన్‌బీడీ, మష్రెక్ బ్యాంక్, ఎమిరేట్స్ ఇస్లామిక్, దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి జీరో శాతం వాయిదాల సేవను పొందవచ్చు. అబుదాబి నివాసితులు తమ యుటిలిటీ బిల్లులను వాయిదాలలో చెల్లించే అవకాశం కూడా ఉంది.

Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!

Updated Date - 2023-11-15T08:45:40+05:30 IST