Share News

Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!

ABN , First Publish Date - 2023-11-10T08:21:52+05:30 IST

దాయాది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు నెలచూపులే చూస్తుంది. దాంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడటం సాధారణం అయిపోయింది.

Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: దాయాది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ నెలచూపులే చూస్తుంది. దాంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడటం సాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం వచ్చి పడింది. ఆ దేశం ఉన్నట్టుండి తమ పౌరులకు పాస్‌పోర్టుల (Passports) జారీనీ బంద్ చేసింది. దీనికి కారణం ల్యామినేషన్ పేపర్ (Lamination paper) కొరత. వినడానికి వింతగా ఉన్నా.. ఇదే నిజం. దాంతో కొత్త పాస్‌పోర్ట్‌లను పొందడంలో పాకిస్థానీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అక్కడి విద్యార్థుల బాధ వర్ణనాతీతం. విదేశాల్లో అడ్మిషన్ గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. తమ పాస్‌పోర్ట్‌లను పొందడంలో విద్యార్థులు తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నట్లు పాకిస్తానీ మీడియా నివేదికలు చెబుతున్నాయి.

Kuwait: కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచిత ప్రవేశంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

చదువు, ఉద్యోగం, విహారం కోసం విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ అవసరమయ్యే వేలాది మంది పాకిస్థానీలు (Pakistanis) తమ కష్టాలకు అంతు లేకుండా పోయిందని వాపోతున్నారు. తమ చేతికి పాస్‌పోర్ట్ వచ్చేది ఎప్పుడు, తాము విదేశాలకు వెళ్లేది ఎప్పుడంటూ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కనీసం ల్యామినేషన్ పేపర్ కూడా కొనుగోలు చేయలేని దుర్భర స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ ఉండడం విచారకరమని అంటున్నారు. అయితే, పాకిస్తాన్‌కు ఈ సమస్య కొత్తేమీ కాదు. గతంలో కూడా తమ పౌరులకు పాస్‌పోర్ట్‌లు జారీ చేయడంలో ఆ దేశానికి ఇలాంటి అసమర్థతతో కూడిన చరిత్ర ఉంది. 2013లో డీజీఐ అండ్ పీ (DGI&P) ప్రింటర్‌లకు చెల్లించాల్సిన బకాయిలు, ల్యామినేషన్ పేపర్‌ల కొరత కారణంగా పాస్‌పోర్ట్ ప్రింటింగ్ ఇదే విధంగా నిలిచిపోయిన విషయాన్ని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఈ సందర్భంగా నివేదించింది.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

ఇదిలాఉంటే.. " ఈ పరిస్థితి త్వరలో చక్కబడుతుంది. పాస్‌పోర్ట్ జారీ సాధారణంగా కొనసాగుతుంది" అని అంతర్గత మంత్రిత్వ శాఖ మీడియా డైరెక్టర్ జనరల్ ఖాదిర్ యార్ తివానా మీడియాతో తెలిపారు. అయితే, తివానా వాదనలతో పాకిస్థానీలు ఏకీభవించడం లేదు. ప్రకటనలు తప్ప ఆచరణ ఉండదని దుయ్యబడుతున్నారు. ఇక పెషావర్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ గతంలో రోజుకు 3వేల నుంచి 4వేల పాస్‌పోర్ట్‌లు ప్రాసెస్ చేయడం జరిగిందని, ప్రస్తుతం రోజుకు 12 నుండి 13 పాస్‌పోర్ట్‌లను మాత్రమే ప్రాసెస్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మరో నెల లేదా రెండు నెలలు వేచి ఉండవలసి ఉంటుందని అధికారి పేర్కొన్నారు.

GCC: గల్ఫ్ దేశాలకు వెళ్లే టూరిస్టులకు పండగలాంటి వార్త.. ఇకపై..


Updated Date - 2023-11-10T09:04:15+05:30 IST