Share News

GCC: గల్ఫ్ దేశాలకు వెళ్లే టూరిస్టులకు పండగలాంటి వార్త.. ఇకపై..

ABN , First Publish Date - 2023-11-09T11:03:37+05:30 IST

గల్ఫ్ దేశాలకు వెళ్లే టూరిస్టులకు గుడ్‌న్యూస్. ఇకపై ఒకే వీసాతో గల్ఫ్ దేశాలన్నీ చుట్టేయవచ్చు. ఈ మేరకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) రాష్ట్రాలు తాజాగా ఏకగ్రీవంగా గల్ఫ్ టూరిస్ట్ వీసాను ఆమోదించాయి.

GCC: గల్ఫ్ దేశాలకు వెళ్లే టూరిస్టులకు పండగలాంటి వార్త.. ఇకపై..

ఎన్నారై డెస్క్: గల్ఫ్ దేశాలకు వెళ్లే టూరిస్టులకు గుడ్‌న్యూస్. ఇకపై ఒకే వీసాతో గల్ఫ్ దేశాలన్నీ చుట్టేయవచ్చు. ఈ మేరకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) రాష్ట్రాలు తాజాగా ఏకగ్రీవంగా గల్ఫ్ టూరిస్ట్ వీసాను ఆమోదించాయి. ఒమన్ రాజధాని మస్కట్‌లో జరిగిన జీసీసీ అంతర్గత మంత్రుల 40వ సమావేశంలో అరబ్ స్టేట్స్ ఆఫ్ గల్ఫ్‌ (Arab States of Gulf) సహకార మండలి సెక్రటరీ జనరల్ జస్సిమ్ మొహమ్మద్ అల్ బుదైవి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అల్ బుదైవి కొత్త ఏకీకృత గల్ఫ్ టూరిస్ట్ వీసా (Unified Gulf Tourist Visa)ను తీసుకురావడం అనేది చాలా మంచి నిర్ణయమని అన్నారు. ఇది ఒక అద్భుతమైన విజయంగా ఆయన అభివర్ణించారు. జీసీసీ నాయకుల సహకారంతోనే ఇది సాధ్యమైందని అల్ బుదైవి పేర్కొన్నారు.

Kuwait: కువైత్ సర్కార్‌కి ప్రవాసులు చెల్లిస్తున్న.. నెలవారీ కరెంట్ బిల్లులు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

GCC.jpg

ఇక ఈ సమావేశంలోనే గల్ఫ్ అంతర్గత మంత్రులు జీసీసీ దేశాలలో ట్రాఫిక్ ఉల్లంఘనలను అనుసంధానించే ఏకీకృత ఎలక్ట్రానిక్ వ్యవస్థ (Electronic System) ను కూడా ప్రారంభించారు. జీసీసీ దేశాల మధ్య యూనిఫైడ్‌గా ట్రాఫిక్ ఉల్లంఘనలను అనుసంధానించే ఈ ప్రాజెక్ట్.. ట్రాఫిక్ భద్రతా లక్ష్యాలను సాధించడంలో దోహదపడే కార్యక్రమాలలో ఒకటి అని ఈ సందర్భంగా అల్ బుదైవి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ఈ వ్యవస్థ జీసీసీ దేశాలలోని పౌరులకు అనేక రకాల ఏకీకృత ట్రాఫిక్ సేవలను అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు.

NRI News: అమెరికాలో ఘోరం.. కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి మృతి!

జీసీసీ దేశాలు (GCC countries) వివిధ స్థాయిలలో విశేషమైన పురోగతి సాధించాయన్నారు. వారి అభివృద్ధి ప్రయత్నాలకు ప్రాంతీయ, ప్రపంచ స్థాయి గుర్తింపును పొందడం హర్షనీయం అన్నారు. "ఈ వ్యవస్థకు ఉన్నత స్థాయి జాతీయ భద్రతను నిర్వహించడం అవసరం. అలాగే ప్రాంతాల నిరంతర పురోగతికి ఆటంకం కలిగించే ఏవైనా బెదిరింపులను నిరోధించడం కూడా ఎంతో ముఖ్యం" అని అల్ బుదైవి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జీసీసీ దేశాలలో డ్రగ్స్ వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనను సెక్రటరీ జనరల్ ప్రస్తావించారు. ఈ ప్రాంత యువతలో ఈ సమస్యను పరిష్కరించడానికి సమిష్టి చర్య అవసరమని ఆయన నొక్కి చెప్పారు. డ్రగ్స్ సంబంధిత సమస్యల నివారణకు నియంత్రణ, చికిత్సతో కూడిన ఏకీకృత వ్యూహాన్ని అనుసరించాలని ఆయన తెలిపారు.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

Updated Date - 2023-11-09T11:10:13+05:30 IST