Share News

NRI News: అమెరికాలో ఘోరం.. కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి మృతి!

ABN , First Publish Date - 2023-11-09T08:43:24+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పది రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి పుచ్చా వరుణ్‌ రాజ్‌‌ (Pucha Varun Raj) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు అమెరికా అధికారులు అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందించారు.

NRI News: అమెరికాలో ఘోరం.. కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి మృతి!

ఇండియానా: అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పది రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి పుచ్చా వరుణ్‌ రాజ్‌‌ (Pucha Varun Raj) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు అమెరికా అధికారులు అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం (Mamilligudem in Khammam) కు చెందిన వరుణ్‌ రాజ్‌‌ (24) ఉన్నత చదువుల కోసం గతేడాది ఆగస్టులో యూఎస్ (US) వెళ్లాడు. ఇండియానాలోని ఓ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ (Master’s degree in Computer Science) చేస్తున్నారు. వరుణ్‌ ఎంఎస్‌ చేస్తూనే పార్ట్‌టైం జాబ్‌ కూడా చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31 (మంగళవారం) అతడు స్థానికంగా ఉండే ప్లానెట్ ఫిట్‌నెస్ క్లబ్ జిమ్‌ (Planet Fitness Club) లో ఉండగా జోర్డాన్ ఆండ్రేడ్ (Jordan Andrade) అనే అమెరికన్ జాతీయుడు ఉన్నట్టుండి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

అక్కడ ఉన్నవారు అసలేం జరిగిందో తెలుసుకునేలోపే వరుణ్ రాజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అతణ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వరుణ్ రాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. ఇక వరుణ్‌ రాజ్‌పై దాడి చేసిన జోర్డాన్ ఆండ్రేడ్‌ను పోలీసులు ఇప్పిటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కూడా విచారం వ్యక్తం చేసింది. వరుణ్ రాజ్‌పై దాడి తమకు తీవ్రంగా కలిచివేసిందని అధికారులు తెలిపారు. ఇది విద్వేషపూరితంగా జరిగిన దాడిగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

ఇక ఈ దాడి ఘటనపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించిన సంగతి తెలిసిందే. బాధితులకు కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని కేటీఆర్ తన 'ఎక్స్' (అంతకుముందు ట్విటర్) ఖాతా ద్వారా తెలిపారు. అమెరికాలోని భారత ఎంబసీ, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. దీనికోసం వరుణ్ కుటుంబ సభ్యులతో తన టీం మాట్లాడుతుందని చెప్పారు. కానీ, దురదృష్టవశాత్తు వరుణ్ రాజ్ మృతిచెందాడు. వరుణ్ రాజ్ తండ్రి మహబూబాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వరుణ్ రాజ్ మృతితో అతని స్వగ్రామం మామిళ్లగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరుణ్ రాజ్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా చూడాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

Updated Date - 2023-11-09T08:43:25+05:30 IST