Share News

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

ABN , First Publish Date - 2023-11-03T09:30:01+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విహార యాత్రకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీకో సూపర్ న్యూస్. ఫ్యామిలీ మొత్తం ఒకేసారి గ్రూపు విజిట్ వీసా (Family visit visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో పిల్లలకు ఫ్రీగా వీసా పొందే వెసులుబాటు కూడా ఉంది.

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విహార యాత్రకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీకో సూపర్ న్యూస్. ఫ్యామిలీ మొత్తం ఒకేసారి గ్రూపు విజిట్ వీసా (Family visit visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో పిల్లలకు ఫ్రీగా వీసా పొందే వెసులుబాటు కూడా ఉంది. పేరెంట్స్‌కు మాత్రం నామమాత్రపు ఫీజు ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లలకు ఇది వర్తిస్తుంది. ఇక పిల్లల వీసా దరఖాస్తును వారి తల్లి లేదా తండ్రి ఆప్లికేషన్‌తో కలిపి దరఖాస్తు చేసుకోవచ్చని టూర్స్ అండ్ ట్రావెలింగ్ నిపుణుడు సుబైర్ తేకేపురథ్వలప్పిల్ తెలిపారు. "18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వీసా రుసుము లేనందున ఫ్యామిలీ గ్రూపు విజిట్ వీసా కుటుంబాలకు మరింత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నది" అని అన్నరాయన. అంతేగాక ఈ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే పిల్లల సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితులు ఉండవన్నారు. అలాగే సింగిల్ పేరెంట్‌తో ప్రయాణించే పిల్లలకు కూడా ఈ ఉచిత వీసా పథకం వర్తిస్తుందని చెప్పారు. ఇక ఈ వీసా ద్వారా యూఏఈలో 30 రోజుల నుంచి 60 రోజుల వరకు బస చేసే వెసులుబాటు ఉంటుంది.

కాగా, పండుగల సీజన్ దగ్గర పడుతున్నందున ప్రస్తుతం ప్రతిరోజూ భారీ సంఖ్యలోనే ఫ్యామిలీ గ్రూపు విజిట్ వీసాలు జారీ చేయబడుతున్నాయని, ముఖ్యంగా దుబాయ్‌లో దీపావళి జరుపుకోవాలనుకునే భారతీయులకు అని తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిరోజ్ మలియక్కల్ అన్నారు. అయితే, ఈ వీసా కొత్తదేమి కాదు. రెండు సంవత్సరాల క్రితం పరిచయం చేయబడింది. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులకు ఇది మొదటి ఎంపికగా మారింది.

US Visas: అమెరికా వీసాల కోసం చూస్తున్నవారికి గుడ్‌న్యూస్.. 542 నుంచి 37 రోజులకు తగ్గిన వెయిటింగ్!


వీసా దరఖాస్తు ఇలా..

* ట్రావెల్ ఏజెన్సీలో కుటుంబం మొత్తం ఒకేసారి వారి పాస్‌పోర్ట్ కాపీలు, ఫొటోలు ఇవ్వాలి.

* ఫీజు చెల్లించాలి. ఈ వీసా కోసం పిల్లలకు ఎలాంటి రుసుము ఉండదు. కానీ, ట్రావెల్ ఏజెంట్లకు సర్వీస్ చార్జీలు, ఇన్సూరెన్స్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

* ఆ తర్వాత ట్రావెల్ ఏజెన్సీ మన దరఖాస్తు ప్రాసెస్ చేస్తుంది.

* అనంతరం ఒకటి, రెండు రోజుల్లో వీసా మన చేతికి వచ్చేస్తుంది.

వీసా రుసుము..

* పిల్లలకు సర్వీస్ ఛార్జీతో పాటు తల్లిదండ్రుల కోసం వీసా రుసుము అనేది ట్రావెల్ ఏజెన్సీని బట్టి మారుతుంది.

* ఇక 30 రోజుల వీసాకు పేరెంట్స్‌కు రూ. 7,929 నుంచి రూ. 11,328 వరకు ఉంటాయి.

* పిల్లలకు సర్వీస్ చార్జీలు, ఇన్సూరెన్స్ కలిపి రూ. 1,812 నుంచి రూ. 2,718 అవుతాయి.

* అలాగే 60 రోజుల వీసా అనేది రూ. 11,328 నుంచి రూ. 14,726 అవుతుంది. పిల్లల సర్వీస్ చార్జీలు, ఇన్సూరెన్స్ కలిపి రూ. 2,945 నుంచి రూ. 3,851 అవుతాయి.

వీసా పొడిగింపు విధానం..

దేశం నుండి నిష్క్రమించకుండానే కుటుంబ వీసాను పొడిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, పిల్లలకు పూర్తి వీసా రుసుము చెల్లించాలి. దేశంలో పొడిగింపు పిల్లలకు ఉచితం కాదని సుబైర్ అన్నారు. ఇక సందర్శకులు దేశం నుండి నిష్క్రమించకుండానే కుటుంబ వీసాను ఏకంగా 120 రోజుల వరకు పొడిగించవచ్చు.

Kuwait: కువైత్‌లో అనూహ్య పరిణామం.. భారీగా పెరిగిన డొమెస్టిక్ వర్కర్లు.. అత్యధికులు భారతీయులే!

Updated Date - 2023-11-03T10:50:02+05:30 IST