Share News

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

ABN , First Publish Date - 2023-11-04T09:35:27+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

Abu Dhabi Big Ticket raffle: అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా. దానిలో భాగంగా క్రమం తప్పకుండా లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారి అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. ఇదిగో ఈ ప్రవాసుడి విషయంలో అదే జరిగింది. ఫ్రీగా వచ్చిన లాటరీ టికెట్‌తో అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ (Abu Dhabi Big Ticket raffle) డ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల రూ. 45.28కోట్లు. సిరియాకు చెందిన అజ్మీ మతానియస్ హౌరానీ (Azmi Mtanious Hourani) కి ఇలా అదృష్టం వరించింది.

Kuwait: ప్రవాసులకు కువైత్ ఝలక్.. వర్క్ పర్మిట్ రెన్యువల్‌ నిలిపివేత..!


వివరాల్లోకి వెళ్తే.. అల్ ఐన్‌ (Al Ain) లోని గార్డెన్ సిటీలో నివాసం ఉండే అజ్మీ మతానియస్.. ఇటీవల బిగ్ టికెట్ రాఫెల్ వారు ప్రకటించిన '2+1' ఆఫర్‌లో భాగంగా అక్టోబర్ 24న రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఈ ఆఫర్‌లో భాగంగా అతనికి ఒక టికెట్ ఉచితంగా వచ్చింది. అలా ఫ్రీగా వచ్చిన లాటరీ టికెట్‌కే మనోడి తాజాగా జాక్‌పాట్ తగిలింది. అబుదాబిలో తాజాగా నిర్వహించిన సీరిస్ నంబర్ 257 డ్రాలో అజ్మీ మతానియస్‌కు ఆఫర్‌లో భాగంగా ఫ్రీగా వచ్చిన లాటరీ టికెట్ నంబర్ 175573కు ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ తగిలాయి. ఇలా ఫ్రీగా వచ్చిన టికెట్ అతణ్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసిందన్నమాట. అయితే, విజేతగా నిలిచిన విషయం అజ్మీ మతానియస్‌‌కు తెలియజేయాలని నిర్వాహకుల అతడు ఇచ్చిన రెండు మొబైల్ నంబర్లకు కాంటాక్ట్ చేశారు. కానీ, ఆ రెండు నెంబర్లు పనిచేయడం లేదట. దాంతో వేరే మార్గాల్లో అతడిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రాఫెల్ నిర్వాహకులు తెలిపారు.

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

ఇదిలాఉంటే.. ఈ నవంబర్ నెల మొత్తం లాటరీ టికెట్లు కొనుగోలు చేసే వారు డిసెంబర్ 3న నిర్వహించే డ్రాలో బంపర్ ప్రైజ్ కింద 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకునే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు. అలాగే టికెట్ కొనుగోలు చేసే వారందరూ ఆటోమేటిక్‌గా రోజువారీ ఎలక్ట్రానిక్ డ్రాలో రిజిస్టర్ కావడం జరుగుతుందని తెలిపారు. దాంతో ప్రతిరోజూ 24 క్యారెట్ గోల్డ్ బార్ గెలుచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక డ్రీమ్ కార్ టికెట్స్‌ కొనుగోలు చేసే వారికి సరికొత్త రేంజ్ రోవర్ వెలార్‌ (Range Rover Velar) ను గెలుచుకునే అవకాశం ఉంటుందని బిగ్ టికెట్ నిర్వాహకులు చెప్పారు.

Kuwait: కువైత్‌లో అనూహ్య పరిణామం.. భారీగా పెరిగిన డొమెస్టిక్ వర్కర్లు.. అత్యధికులు భారతీయులే!

Updated Date - 2023-11-04T09:41:04+05:30 IST