ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Golden Gavel Award: తెలుగు కుర్రాడి ప్రతిభకు అమెరికా సెల్యూట్.. సూపర్ టాలెంట్‌తో అబ్బురపరిచిన చిచ్చర పిడుగు!

ABN, First Publish Date - 2023-02-10T08:58:51+05:30

అగ్రరాజ్యం అమెరికాలో (America) ఓ తెలుగు కుర్రాడు (Telugu Boy) తన సూపర్ టాలెంట్‌తో అబ్బురపరిచాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో (America) ఓ తెలుగు కుర్రాడు (Telugu Boy) తన సూపర్ టాలెంట్‌తో అబ్బురపరిచాడు. మనోడి ప్రతిభకు అగ్రరాజ్యం సెల్యూట్ (America Salutes) చేస్తోంది. సాహిత్ మంగు (Sahith Mangu) అనే తెలుగు కుర్రాడు తన అద్భుతమైన ప్రసంగాలతో ప్రతిష్టాత్మక గోల్డెన్ గావెల్ అవార్డ్ (Golden Gavel Award) సొంతం చేసుకున్నాడు. న్యూజెర్సీ (New Jersey) రాష్ట్రంలో నిర్వహించిన గార్డెన్‌ స్టేట్‌ డిబెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో మనోడు విజేతగా నిలిచాడు. కాగా, సాహిత్ కుటుంబం హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లి, న్యూజెర్సీలో స్థిరపడింది.

సెడార్ హిల్ ప్రిప‌రేట‌రీ పాఠశాలలో సాహిత్ ప్రస్తుతం 7వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. డిబెట్ లీగ్ టోర్నమెంట్‌లో ఈ ఏడాది వివిధ స్కూళ్లకు చెందిన మొత్తం164 మంది విద్యార్థులు పోటీపడ్డారు. వీరందరిని వెనక్కి నెట్టి సాహిత్‌ గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డు గెలుచుకోవడం విశేషం. సాహిత్‌ చేసిన పరిశోధన, లోతైన విషయ అవగాహనకు తోడు ధాటిగా చేసిన ప్రసంగం న్యాయనిర్ణేతలను అమితంగా ఆకట్టుకుంది. దాంతో మనోడు విన్నర్‌గా నిలిచాడు. సాహిత్ ఎంచుకున్న అంశాలు, వాటికి మద్ధతుగా సేకరించిన విషయాలను ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలు ప్రత్యేకంగా అభినందించారంటే మనోడి ప్రసంగం ఏ రేంజ్‌లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: అందంగా కనిపించాలని ముక్కుకు సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే షాకింగ్ ఘటన..

ఇంతకీ ఈ డిబేట్‌లో మనోడు ఎంచుకున్న అంశాలు ఏంటో తెలుసా? 1. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించడం, 2. అమెరికాలో అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకురావడం, 3. ఫేషియల్‌ టెక్నాలజీతో చెడు కంటే మంచే ఎక్కువ, 4. శాఖాహారమే మంచిది-మాంసాహారం సరికాదు వంటి కీలక అంశాలను ఎంచుకుని వీటిపై అనర్గళంగా, పూర్తి సమాచారంతో సాహిత్ ప్రసంగం కొనసాగింది. ఈ నాలుగు అంశాలపై ధాటిగా ప్రసంగించి తన వాదనతో న్యాయనిర్ణేతలను మెప్పించి విజేతగా నిలిచాడు. దాంతో గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌గా నిలిచి అవార్డు అందుకోవడం జరిగింది. ఇక తమ కుమారుడు ప్రతిష్టాత్మక గోల్డెన్ గావెల్ అవార్డుకు ఎంపిక కావడంపట్ల సాహిత్ మంగు పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమ తెలుగు కమ్యూనిటీతో పాటు యావత్ భారత దేశానికి దక్కిన అరుదైన గౌరవంగా వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: రూ. 32 వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ.. ఐదేళ్లుగా ఎఫ్‌బీఐ వేట.. ఇప్పుడు ఎక్కడ ?

Updated Date - 2023-02-10T10:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising