Ruja Ignatova: రూ. 32 వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ.. ఐదేళ్లుగా ఎఫ్‌బీఐ వేట.. ఇప్పుడు ఎక్కడ ?

ABN , First Publish Date - 2023-02-09T09:24:18+05:30 IST

పైన ఫొటోలో సినిమా హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్న ఈమె పేరు రూజా ఇగ్నోటోవా (Ruja Ignatova). ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటే నమ్మగలమా? కానీ, ఇది నిజం.

Ruja Ignatova: రూ. 32 వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ.. ఐదేళ్లుగా ఎఫ్‌బీఐ వేట.. ఇప్పుడు ఎక్కడ ?

ఇంటర్నెట్ డెస్క్: పైన ఫొటోలో సినిమా హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్న ఈమె పేరు రూజా ఇగ్నోటోవా (Ruja Ignatova). ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటే నమ్మగలమా? కానీ, ఇది నిజం. ఐదేళ్లుగా అగ్రరాజ్యం అమెరికా పోలీసులు రూజా కోసం వెతుకుతున్నారు. ఇంతకీ ఈమే ఏం చేసిందనేగా మీ అనుమానం. ఒకటికాదు రెండుకాదు ఏకంగా రూ.32వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ. 2014లో ఒక నకిలీ క్రిప్టో కరెన్సీని ప్రారంభించింది. దాని పేరు వన్ కాయిన్ (One Coin). దీనిలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులు రాబట్టింది. అలా మూడేళ్లలో మొత్తం 400కోట్ల డాలర్లు జమా చేసుకుంది. ఆ తర్వాత ఆ నగదుతో 2017లో గ్రీస్ వెళ్లే విమానం ఎక్కేసింది. అంతే.. ఆ తర్వాత నుంచి ఆమె ప్రపంచానికి కనిపించకుండా పోయింది.

ఇలా దోచుకెళ్లిన సొమ్ము మన రూపాయల్లో చెప్పుకుంటే అక్షరాల 31, 937కోట్లు. దీంతో అమెరికన్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సంస్థ అయిన ఎఫ్‌బీఐ (FBI) గత ఐదేళ్ల నుంచి ఆమె కోసం తీవ్రంగా గాలిస్తుంది. ఇక ఎఫ్‌బీఐ వాటెండ్ జాబితాలో మొత్తంగా 529 మంది ఉంటే.. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఎఫ్‌బీఐ టాప్-10 మోస్ట్ వాటెండ్ క్రిమినళ్ల జాబితాలో రూజా పేరు కూడా ఉంది. అలాగే యూరోప్‌లో మోస్ట్ వాటెండ్ క్రిమినల్స్‌లో కూడా ఆమె ఒకరు. చివరగా ఆమె బల్గేరియా నుంచి గ్రీస్ రాజధాని ఏథెన్స్‌కు వెళ్లిందట. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో తెలియదు. కానీ, తాను పట్టుబడకుండా ఉండేందుకు మాత్రం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపాన్ని కూడా మార్చుకుని ఉండొచ్చని ఎఫ్‌బీఐ అనుమానం వ్యక్తం చేసింది. ఇక ఇంత భారీ మొత్తంతో దేశం దాటిన రూజాపై అమెరికా పోలీసులు 2019లో వైర్‌ఫ్రాడ్, మనీలాండరింగ్, సెక్యూరిటీ మోసాల కింద కేసు ఓపెన్ చేశారు. ఆమె బల్గేరియాలో జన్మించిన జర్మన్ పౌరురాలు. ఆమె తండ్రి ఇంజనీర్, తల్లి టీచర్. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో యూరోపియన్ లా చదివిన తర్వాత రూజా.. సోఫియాలోని ఓ ప్రైవేట్ సంస్థలో కన్సల్టేంట్‌గా జాబ్‌లో చేరింది. ఈ క్రమంలో 2012లో ఆమె తన తండ్రితో కలిసి జర్మనీలో ఓ కంపెనీని ఓపెన్ చేసింది. ఆ తర్వాత కొద్దికాలానికే దాన్ని అనుమానాస్పద స్థితిలో మూసేసి దివాలా తీసినట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290కోట్లు.. ఆ భారీ నగదుతో ఆమె ఏం చేసిందంటే..?

Ruja.jpg

ఇందులో రూజా మోసానికి పాల్పడినట్లు తేలడంతో ఆమె 14నెలల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె బిట్‌కాయిన్ (Bitcoin) రూపంలో మల్టీలెవల్ స్కామ్‌కు పాల్పడింది. వన్ కాయిన్ పేరిట తీసుకొచ్చిన ఈ బిట్‌కాయిన్ గురించి వినియోగదారులను తనదైన శైలిలో సెమినార్లు నిర్వహిస్తూ బాగా ఆకట్టుకుంది. దీనిలో భాగంగా అమెరికా, బ్రిటన్ (Britain) దేశాలు తిరుగుతూ భారీ మొత్తంలో సెమినార్లు నిర్వహించింది. ఇండియాలో కూడా వన్‌కాయిన్ సంస్థ ఓ సెమినార్ నిర్వహించింది. 2017లో ముంబై వేదికగా ఈ సెమినార్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు సెమినార్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని సంస్థ ఉద్యోగుల నుంచి 17మిలియన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకే రూజా బయటి ప్రపంచానికి కనిపించకుండా పోయింది. అయితే, అప్పుడు ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. రూజా తమ్ముడు ఆ తర్వాత వన్‌కాయిన్ సంస్థను నడిపించాడు. కానీ, 2019లో లాస్ ఏంజిల్స్ (Los Angeles) పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వన్‌కాయిన్ ఫ్రాడ్ కంపెనీ అని ఎఫ్‌బీఐ ప్రకటించింది. కానీ, అప్పటికే రూజా భారీ కరెన్సీతో దేశం దాటిపోయింది. దాంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

Ruja-Ignatova.jpg

ఇక బ్రిటన్ లాయర్ల ద్వారా ఆమె గురించి చాలా విషయాలు తెలిశాయి. కెన్సింగ్టన్‌లోని ఓ అబార్డ్స్ హౌజ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ వ్యక్తి ఆమె షాపింగ్ నుంచి తిరిగి వచ్చినప్పుడు చూసినట్లు చెప్పాడు. ఆమె తన ఇద్దరు బాడీగార్డులతో కలిసి కనిపించిదని, ఖర్చులకు ఏమాత్రం వెనుకాడకుండా షాపింగ్స్ చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. నాలుగు బెడ్‌రూంలు గల ఓ ఇంటిలో ఆమె ఉండేదని, దీనికోసం ఆమె 2.5మిలియన్ పౌండ్ల నుంచి 11మిలియన్ పౌండ్లకు వరకు చెల్లించినట్లు సమాచారం. అయితే, ఈ ఇంట్లో ఆమె 2016 కాలంలో కొంతకాలం మాత్రమే ఉందట. ఇదిలాఉంటే.. ఈమె ఉదాంతంతో బీబీసీ ది మిస్సింగ్ క్రిప్టో క్వీన్ పేరిట షాడో కాస్ట్ సిరీస్‌ను రూపొందిస్తుంది. ఇక రూజా చేసిన మోసం చరిత్రలో అతిపెద్ద స్కామ్స్‌లో ఒకటి అని ఓ ప్రముఖ బ్రిటన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దీన్ని అమెరికా అంత తెలికగా తీసుకోదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎఫ్‌బీఐ ఎట్టిపరిస్థితుల్లో రూజాను వెతికిపట్టుకోవడం ఖాయమని చెబుతున్నారు. కాకపోతే కొంత సమయం పట్టొచ్చనేది వారి అభిప్రాయం.

Updated Date - 2023-02-09T09:40:03+05:30 IST