Jackpot: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290కోట్లు.. ఆ భారీ నగదుతో ఆమె ఏం చేసిందంటే..?

ABN , First Publish Date - 2023-02-08T12:25:49+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.

Jackpot: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290కోట్లు.. ఆ భారీ నగదుతో ఆమె ఏం చేసిందంటే..?

ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. క్రమం తప్పకుండా లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ, ఆ అదృష్టం వరిస్తే మాత్రం ఒక్క నైట్‌లోనే జీవితం మొత్తం మారిపోతుంది. ఇదిగో ఈ 18 ఏళ్ల కెనడా యువతి విషయంలో అదే జరిగింది. ఆమె పుట్టిన రోజున (Birthday) కొన్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ. 290కోట్ల జాక్‌పాట్ (Jackpot) తగిలింది. దాంతో రాత్రికి రాత్రే వందల కోట్లకు అధిపతి అయింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు జూలియెట్ లామర్ (Juliette Lamour). ఒంటారియోలో (Ontario) నివాసం ఉండే ఆమె ఇటీవల తన 18వ పుట్టిన రోజు జరుపుకుంది. అయితే, బర్త్‌డే నాడు తాతయ్యతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు ఏం కొనాలో తెలియలేదు. దాంతో తాతాయ్యను (Grand Father) సలహా అడిగింది. ఆయనమో సరదాగా ఓ లాటరీ టికెట్ (Lottery Ticket) కొనమని చెప్పాడు. తాత చెప్పినట్లే ఆమె ఓ లాటరీ టికెట్ కొన్నది. అలా కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ను తీసుకొచ్చి ఇంట్లో పారేసింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి కూడా. అసలు తాను లాటరీ టికెట్ కొన్న విషయం కూడా ఆమె మరిచిపోయిందట. అయితే, తాజాగా తన పక్కింటివాళ్లకు లాటరీ తగిలి భారీ మొత్తం గెలుచుకున్నట్లు జూలియెట్‌కు తెలిసింది. దాంతో వెంటనే పుట్టిన రోజున తాను లాటరీ టికెట్ కొనుగోలు చేసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది.

ఇది కూడా చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం.. ఇండో-అమెరికన్‌ చిన్నారి అసాధారణ ప్రతిభ

వెంటనే ఆ లాటరీ టికెట్‌ను తీసి, రాఫెల్ (Raffle) నిర్వాహకులు ఇచ్చిన యాప్ ద్వారా చెక్ చేసుకుంది. అందులో ఆమె కొన్న లాటరీ టికెట్‌కు ఏకంగా 48మిలియన్ డాలర్లు (రూ. 290కోట్లు) తగిలాయి. ఇంకేముంది ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక అలా వచ్చిన నగదులో జూలియెట్ అప్పుడే రూ.150కోట్లు ఖర్చు పెట్టేసింది కూడా. మొదట వంద కోట్లు పెట్టి ఓ చార్టెడ్ విమానం (Chartered Flight) కొన్నది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల కోసమని 5 మెర్సీడెస్ బెంజ్ (Mercedes-Benz) కార్లు కొనుగోలు చేసింది. ఒక్కో కారు ధర రూ.2కోట్లు. అలాగే రూ.40కోట్లు పెట్టి ఓ పెద్ద ఇల్లు కూడా సొంతం చేసుకుంది. ఇలా ఇప్పటివరకు రూ.150కోట్లు ఖర్చు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. మిగిలిన డబ్బును మాత్రం ఖర్చు చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటానని చెబుతోంది.

Updated Date - 2023-02-08T12:38:26+05:30 IST