ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: దొంగకు పట్టపగలే చుక్కలు చూపించిన ఎన్నారై.. 'ఇన్ స్టంట్ జస్టిస్' దక్కిందంటూ నెటిజన్ల ప్రశంసలు!

ABN, First Publish Date - 2023-08-04T13:23:20+05:30

దొంగతనానికి వచ్చిన వ్యక్తికి ఓ ఎన్నారై పట్టపగలే చుక్కలు చూపించాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: దొంగతనానికి వచ్చిన వ్యక్తికి ఓ ఎన్నారై పట్టపగలే చుక్కలు చూపించాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన గ్రొసరీ షాపు (Grocery Story) లో దోపిడీకి వచ్చిన నల్లజాతీయుడిని సిక్కు ఎన్నారై (NRI) ధైర్యంగా అడ్డుకుని చితకబాదడం మనం వీడియోలో చూడొచ్చు. కాలిఫోర్నియాలోని ఓ సెవెన్ ఎలెవన్ లో ఈ ఘటన జరిగింది. కత్తితో షాపులోకి చొరబడిన దుండగుడు బెదిరించి పలు వస్తువులను దొచుకెళ్లడానికి యత్నించాడు.

కత్తితో బెదిరిస్తూ గ్రొసరీలో తనకు కావాల్సిన వస్తువులను ఓ ట్రాలీ బాక్స్‌లో సేకరించాడా దొంగ. అనంతరం వాటితో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించాడు. అదే.. సమయంలో ఎన్నారై ఆ నల్లజాతీయుడిపై విరుచుకుపడ్డాడు. కిందపడేసి కర్రతో చావబాదాడు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించాడు. ఇలా పట్టపగలే దొంగకు సిక్కు వ్యక్తి చుక్కలు చూపించాడు. షాపు సీసీటీవీ కెమెరాలో ఈ రాబరీ తాలూకు దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. అవి కాస్తా బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఎన్నారై చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఇన్ స్టంట్ జస్టిస్' దక్కిందంటూ నెటిజన్లు గ్రొసరీ స్టోర్ యజమానిని కొనియాడుతున్నారు.

Zomato: 'ప్లీజ్.. ఇకపై అలా చేయకమ్మా.. ఆపేయ్'.. ట్విట్టర్‌లో యువతికి జొమాటో రిక్వెస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!


Updated Date - 2023-08-04T13:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising