ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

California Mass Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఐదుగురు మృతి!

ABN, First Publish Date - 2023-08-24T10:47:39+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) లోని ప్రముఖ బైకర్ బార్‌ (Biker bar) లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (Law enforcement officer) ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు.

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) లోని ప్రముఖ బైకర్ బార్‌ (Biker bar) లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (Law enforcement officer) ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. గాయపడిన వారిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

కాగా, నిందితుడిని గొడవ కారణంగా భార్య గత కొంతకాలంగా దూరం పెట్టిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి బార్‌లో ఆమెనే లక్ష్యంగా చేసుకుని అతడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగగా.. నిందితుడు సహా ఐదుగురు చనిపోయినట్లు ఆరెంజ్ కౌంటీ పోలీసులు (Orange County Sheriff) వెల్లడించారు. గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Kuwait: ప్రవాసులు బీ అలెర్ట్.. సెప్టెంటర్ 1వ తారీఖు నుంచి కొత్త నిబంధన.. అలా చేశారో స్వదేశానికి రావడం కష్టం..!

Updated Date - 2023-08-24T10:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising