ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eating Timings: తినడానికి ఏది సరైన సమయం..? టిఫిన్, లంచ్, డిన్నర్.. సమయానికే తింటున్నామని అనుకుంటారు కానీ..

ABN, First Publish Date - 2023-06-08T15:49:35+05:30

ఖాళీగా ఉన్నా లేదా పనిలో బిజీగా ఉన్నా సరే సమయానికి ఆహారం తీసుకోవటం మర్చిపోకూడదు.

weight management.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబం పెరిగేకొద్దీ, కలిసి రాత్రి భోజనం చేయడం అనే పద్దతి మారుతూ వస్తుంది. ఇప్పటి రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందుగానే ఆహారం తినిపించి నిద్రపుచ్చుతున్నారు. తరువాత ఎప్పుడో భాగస్వామితో కలిసి తింటున్నారు. కాకపోతే ఆదివారాలు కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేస్తారు. ఇది ఇప్పటి రోజుల్లో వస్తున్న జీవన శైలి మార్పు. కానీ రోజూ స‌మ‌యానికి భోజ‌నం చేయ‌ని వారు మాత్రం క‌చ్చితంగా ఆ అల‌వాటును మానుకోవాలి. స‌మ‌యానికి టిఫిన్, భోజ‌నం చేయాలి. లేదంటే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఆక‌లి వేస్తున్నా వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోతే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో చూద్దాం.

పిల్లలు స్కూల్ కి పంపే సమయంలో ఉదయాన్నే టిఫిన్ ఆదరా బాదరా చేసి వెళిపోతారు. ఇక లంచ్ టైం కూడా అలాగే కంగారుగా ఉన్నవాటితో వంట చేసుకుని తినేస్తున్నారు. అసలు మనం సరైన సమయానికి టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేస్తున్నామా అనేదాని మీద సరైన అవగాహన ఎవరికీ ఉండటం లేదు. సమయం దాటిపోయాకా తినడం వల్ల శరీరంలో అనేక మార్పులకు లోనవుతుంది.

1. వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోతే శ‌రీర మెట‌బాలిజం త‌గ్గుతుంది. దీని వ‌ల్ల క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చు కావు. శరీరంలో కొవ్వు నిల్వ‌లు పేరుకుపోతాయి. అధిక బ‌రువు త‌గ్గ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. బ‌రువు పెరుగుతారు.

2. వేళ‌కు భోజ‌నం చేయ‌ని వారు జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటార‌ని అనేక అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. క‌నుక వేళ‌కు భోజ‌నం చేయాలి.

ఇది కూడా చదవండి: మొక్కజొన్న పొత్తులను ఉడికించి తింటే బెస్టా..? లేక నిప్పులపై కాల్చి తింటే మంచిదా..? అసలు ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!

3. ఆక‌లిగా ఉంటే వెంట‌నే భోజనం చేయాలి. భోజ‌నం చేయ‌లేక‌పోతే పండ్లు లేదా న‌ట్స్ వంటివి తీసుకోవాలి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు త‌గ్గ‌కుండా చూసుకోవ‌చ్చు. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. ఎక్కువ సేపు ఆగ‌రాదు. అలాగే వేళ‌కు భోజ‌నం చేయ‌లి. దీంతో స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

4. అకాల భోజనం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్ (అసిడిటి) సమస్య పెరిగి శరీర పటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా.. అనోరెక్సియా, బలిమియా, బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం. ఈ వ్యాధులు మనషులను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మూడు పూటలా సమయానికి చక్కగా భోజనం చేస్తే.. ఎలాంటి అనారోగ్యం తలెత్తదని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ గందరగోళ ప్రపంచంలో ఇది పాటించడం కొంచెం కష్టమే అయినా ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా మన జీవితాన్ని గడిపెయ్యొచ్చు. ఖాళీగా ఉన్నా లేదా పనిలో బిజీగా ఉన్నా సరే సమయానికి ఆహారం తీసుకోవటం మర్చిపోకూడదు. ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-06-08T15:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising