Corn: మొక్కజొన్న పొత్తులను ఉడికించి తింటే బెస్టా..? లేక నిప్పులపై కాల్చి తింటే మంచిదా..? అసలు ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!
ABN , First Publish Date - 2023-06-08T15:05:07+05:30 IST
కొంతమందికేమో మొక్కజొన్న గింజలు వేయించుకునో.. ఉడకబెట్టుకొనో తినడం ఇష్టం!
జ్యుసి పుచ్చకాయ, తాజాగా ఎంచుకున్న స్ట్రాబెర్రీల నుండి బొద్దుగా ఉండే మామిడి పండ్ల వరకు అందమైన ఫలాలకు వేసవి ఖచ్చితమైన కాలం. వేసవి కాలం మొక్కజొన్నకు ప్రధాన సమయం, ఎందుకంటే దాని సీజన్ మే ప్రారంభంలో ప్రారంభమవుతుంది. వేసవి అంతా నడుస్తుంది. మంచి వర్షం కురుస్తున్న సాయంత్రం చక్కగా వేడి వేడి మొక్కజొన్నపొత్తు తినాలని అంతా ఆశపడతారు. అయితే జొన్న పొత్తును కాల్చి తింటే బావుంటుందా? లేక ఉడికించి తినాలా అనేది చిన్న సందేహం. రెండు విధాలుగా కూడా మొక్కజొన్నపొత్తు బావుంటుంది. పైగా ఇందులో ఉండే గుణాలు, పోషకాల కారణంగా బలంతో పాటు జీర్ణం కావడానికి కూడా మంచి ఆహారంగా పనిచేస్తుంది. అలాగే తిన్న వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.
ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో 125 కాలరీలు ఉంటాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు.. 4 గ్రాముల ప్రొటిన్లు, 9 గ్రాముల షుగర్, 2 గ్రాముల ఫ్యాట్, 75 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.
మొక్కజొన్నలో విటమిన్ బీ12 పుష్కలం. అంతేకాదు ఫోలిక్ యాసిడ్, ఐరన్ కూడా అధికం. ఇవన్నీ శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడతాయి. తద్వారా రక్త హీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఇది దోహదపడుతుంది.
ఇది కూడా చదవండి: పనికిరాదని చెత్త బుట్టలో పారేసే దీన్ని ఇలా వాడండి చాలు.. కళ్ల కింద కనిపిస్తున్న ఈ నల్ల మచ్చలు మటాష్..!
ఉండాల్సిన దాని కన్నా తక్కువ బరువు ఉండి బాధపడుతున్న వారు మొక్కజొన్న తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. తగిన పరిమాణంలో కొంతకాలం పాటు వీటిని తింటే నీరసం తగ్గడంతో పాటు ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. ఇక మొక్కజొన్నలో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలం. ఆహారం జీర్ణమవడంలో ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే.విటమిన్-ఏతో పాటు మొక్కజొన్నలో విటమిన్ బీ, సీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటి జీవక్రియలు సక్రమంగా సాగడంలో తోడ్పడతాయి. ఇక స్వీట్ కార్న్... రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
మొక్కజొన్నలో ఫెలురిక్ యాసిడ్ అనే శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాదు. అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను కూడా అరికడుతుంది. చక్కగా వానపడుతున్న సాయంత్రాన పొత్తు తింటే ఆ మజానే వేరు! తీపి రుచిని ఆస్వాదించే వారైతే స్వీట్‌కార్న్ తినాలనుకుంటారు ! కొంతమందికేమో మొక్కజొన్న గింజలు వేయించుకునో.. ఉడకబెట్టుకొనో తినడం ఇష్టం! ఎలా తిన్నా మొక్కజొన్నపొత్తు కడుపు నిండుగా ఉంచడమే కాదు. తిన్నాకా మంచి ఫీల్ ని ఇస్తుంది.