ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RRR: ఆస్కార్ వేళ షా ను కలిసిన చిరు, చెర్రీ

ABN, First Publish Date - 2023-03-17T22:06:33+05:30

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు.

Ram Charan and his father Chiranjeevi met Union Home Minister Amit Shah
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన వేళ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు కూడా అక్కడే ఉన్నారు. అనంతరం షా తో చిరు, చెర్రీ భేటీ అయ్యారు. రామ్ చరణ్‌ను అభినందించి ఆశీస్సులు అందజేయడంపై చిరంజీవి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పారు.

95వ అకాడమీ అవార్డ్స్‌ (95th Academy Awards)లో జక్కన్న (Jakkanna) చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (best original song oscar 2023) ఆస్కార్ అవార్డును (Oscar Award) కైవసం చేసుకున్న వేళ మరో ఘనతను సాధించింది.

లాస్‌ఏంజెల్స్‌లో ఇటీవలే కీరవాణి (Keeravani), చంద్రబోస్ (Chandrabose) ‘ఆస్కార్’ అవార్డును అందుకున్నారు. దీంతో దేశం సత్తా చాటేలా మీసం మెలేసిన రాజమౌళి అండ్ టీమ్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. ఇండియన్ సినిమా గర్వపడేలా చరిత్ర సృష్టించిన రాజమౌళి (SS Rajamouli), ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను అంతా ప్రశంసిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్న RRR‌కు డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli). మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి (MM Keeravani). లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandra Bose). గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.

Updated Date - 2023-03-17T22:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising