ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narendra Modi: అయోధ్యలో మోదీకి ఘనస్వాగతం.. ప్రారంభించబోయే అభివృద్ధి కార్యక్రమాలివే!

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:10 PM

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో మోదీకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. వివిధ కళాకారుల బృందాలు ప్రధానికి ఘన స్వాగతం పలికాయి.

లక్నో: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో మోదీకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. వివిధ కళాకారుల బృందాలు ప్రధానికి ఘన స్వాగతం పలికాయి. మోదీ రాక సందర్భంగా రామ్‌పాత్‌లో ఏర్పాటుచేసిన మొత్తం 40 వేదికలపై 1,400 మందికి పైగా కళాకారులు.. జానపదకళలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రూ.15,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే విమానాశ్రయం దగ్గర బహిరంగ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసగించనున్నారు. రెండు నూతన అమృత్ భారత్, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు.


అయోధ్యలో పౌర సదుపాయాలను పునరుద్ధరించడానికి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.11,100 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు రూ. 4,600 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. అయోధ్య రామమందిరం చేరుకోవడానికి నిర్మించిన నాలుగు కొత్త రోడ్లను కూడా మోదీ ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. రామ మార్గం, భక్తి మార్గం, ధర్మ మార్గం, శ్రీరామ జన్మభూమి పథం రోడ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. మోదీ రాక సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు అయోధ్యలోనే బస చేయనున్నారు. అలాగే జనవరి 22న ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయాన్ని కూడా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 02:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising