ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హెల్మెట్ పెట్టుకుని చికిత్స చేస్తున్న వైద్యులు.. కారణం ఏంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-07-06T19:23:56+05:30

ఒడిషాలో వైద్యులు హెల్మెట్లు ధరించి రోగులకు చికిత్స చేస్తున్న ఘటన ఆసక్తికరంగా మారింది. బలంగీర్ జిల్లాలోని ఖప్రఖోల్‌లో గల దండాముండా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి భవనం స్లాబ్‌ కొంత భాగం కూలిపోవడంతో దండాముండా ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, ఇతర సిబ్బంది హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒడిషాలో వైద్యులు హెల్మెట్లు ధరించి రోగులకు చికిత్స చేస్తున్న ఘటన ఆసక్తికరంగా మారింది. బలంగీర్ జిల్లాలోని ఖప్రఖోల్‌లో గల దండాముండా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి భవనం స్లాబ్‌ కొంత భాగం కూలిపోవడంతో దండాముండా ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, ఇతర సిబ్బంది హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ ఘటన ఒడిషాలోని ప్రభుత్వాస్పత్రులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయనే దానికి నిదర్శనంగా మారింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బలంగీర్ జిల్లాలోని ఖప్రఖోల్‌లో గల దండముండా ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్న సుమంత నాయక్ సోమవారం మెడిసిన్ వార్డు వద్ద స్లాబ్ కూలిపోవడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

“ఈ సంఘటన సోమవారం ఉదయం 8.30 గంటలకు జరిగింది. నేను, కొంతమంది రోగులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాము. దీని తరువాత నేను ద్విచక్రవాహనం హెల్మెట్‌‌ని పెట్టుకుని విధులు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ రోజు హెల్మెట్‌తో విధులకు హాజరయ్యాను ”అని సుమంత నాయక్ చెప్పుకొచ్చారు. ఆసుపత్రి వైద్యుడు బాలకృష్ణ పురోహిత్‌ మాట్లాడుతూ ‘‘ఆసుపత్రి భవనం అధ్వాన్న స్థితి గురించి ఉన్నతాధికారులకు తెలుసు. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల భవనం కూలిపోతుంది. అయినా వారు పట్టించుకోవడం లేదు.”అని చెప్పారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం (OPD) భవనాన్ని ఐదేళ్ల క్రితమే నిర్మించారు. అయితే నాణ్యత లేని పనులు, నాసిరకం మెటీరియల్ వాడడం వల్ల భవనం స్లాబ్ కూలిపోతుంది. అయితే ఇది ఒడిషాలో ఒక్క దండముండా ఆసుపత్రికే పరిమితం కాలేదు. ప్రభుత్వం అధీనంలో ఉన్న అనేక ఆసుపత్రుల్లో పరిస్థితి ఇలాగే ఉందని రోగులు, వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని వారు అంటున్నారు.

Updated Date - 2023-07-06T19:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising