ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madras HC judge : విక్డోరియా గౌరీపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2023-02-07T11:56:27+05:30

మద్రాస్ హైకోర్టు (Madras high court) అదనపు జడ్జిగా అడ్వకేట్ ఎల్‌సీ విక్టోరియా గౌరి (LC Victoria Gowri)ని నియమించడాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మద్రాస్ హైకోర్టు (Madras high court) అదనపు జడ్జిగా అడ్వకేట్ ఎల్‌సీ విక్టోరియా గౌరి (LC Victoria Gowri)ని నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఆమె హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ టీ రాజా ప్రమాణం చేయించారు. ఆమెతోపాటు మరో నలుగురు కూడా న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా అడ్వకేట్ ఎల్‌సీ విక్టోరియా గౌరిని నియమిస్తూ కొలీజియం సిఫారసు చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆమె నియామకాన్ని కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గౌరి మంగళవారం ఉదయం 10.35 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను అంతకుముందే నిర్వహించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.

గౌరి క్రైస్తవులు, ముస్లింలపై విద్వేషపూరితంగా మాట్లాడారని పిటిషనర్లు ఆరోపించారు. అయితే ఆమెను న్యాయమూర్తిగా నియమించడంతో ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె ఓ బీజేపీ నాయకురాలి మాదిరిగా మాట్లాడారన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం పట్టించుకోలేదు. న్యాయమూర్తులను పదవీచ్యుతులను చేయాలంటే కేవలం పార్లమెంటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2023-02-07T11:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising