ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Turmeric: పెద్దగా పట్టించుకోరు కానీ.. వంటల్లో వాడే పసుపుతో ఇన్ని లాభాలుంటాయని తెలుసా?

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:17 PM

పసుపును వంటల్లోనూ, గాయాలు తగిలినప్పుడు వాడుతుంటాం కానీ దీంట్లో ఇంత మ్యాటర్ ఉందని తెలుసా?

పసుపు బోలెడు వంటకాలలో ఉపయోగించే పదార్థం. పసుపు లేని వంట చూడటానికి ఏమీ బాగోదు. ఇక ఈ పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా ఇది ఆయుర్వేద ఔషదంగా కూడా పరిగణించబడుతుంది. రంగు కోసం, రోగనిరోధక శక్తి కోసం ఉపయోగించే పసుపు కేవలం ఈ ప్రయోజనాలనే కాకుండా బోలెడు ఆరోగ్య సమస్యలకు ఔషదంగా పనిచేస్తుంది. సూపర్ ఫుడ్ గా పరిగణించే పసుపు వల్ల కలిగే లాభాలు ఇవీ..

వాపులు, నొప్పులు తగ్గిస్తుంది..

పసుపులో ఉండే కర్కుమిన్ సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం. ఇది వాపుకు వ్యతిరేకంగా పోరాటానికి సహాయపడుతుంది. ఎక్కువకాలం వేధించే మంటలు, వాపులను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్‌ లో పసుపును చేర్చుకుంటే మంచిది.

యాంటీ ఆక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్..

ఫ్రీ రాడికల్స్‌ శరీరంలో కణాలను దెబ్బతీస్తాయి. పసుపులో ఉనన యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఫ్రీరాడికల్స్ ను నియంత్రిస్తాయి. వృద్దాప్యంలో వచ్చే వ్యాధులలో బాగా పనిచేస్తుంది. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మొత్తం శరీరానికి మేలు చేస్తుంది.

ఇది కూడా చదవండి: జీలకర్ర నీళ్లు ఇంత పవరా? ఉదయాన్నే తాగితే జరిగేదిదే..!


గుండెకు మంచిది..

గుండె ఆరోగ్యానికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి, గుండె కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. పసుపు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరుస్తుంది.

జీవక్రియకు సహాయపడుతుంది..

పసుపు పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలు తగ్గిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల గట్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. గట్ మైక్రోబయోమ్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: ఎక్కువ కాలం బ్రతకాలనుందా? ఈ సింపుల్ టిప్స్ తో ఆయుష్షు ఫుల్!


మెదడు ఆరోగ్యానికి..

పసుపులో ఉండే కర్కుమిన్ మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. మెదడులో పనిచేసే గ్రోత్ హార్మోన్, మెదడు వ్యాధులను ఆలస్యం చేయడం లేదా తిప్పికొట్టడం చేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇది సహయపడుతుంది.

కీళ్లనొప్పులు..

ర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకు పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉపశమనం కలిగిస్తాయి. జాయింట్ డిజార్డర్స్ ఉన్నవారి జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిణి..

కర్కుమిన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదల, వ్యాప్తిని నిరోధిస్తుంది. పసుపులో ఆహారంలో విరివిగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది.

(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్య సమస్యలేవైనా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది)

ఇది కూడా చదవండి: Hair Fall: జుట్టు బాగా రాలిపోతోందా? అయితే మీకూ ఈ లోపాలుండటం పక్కా..!


Updated Date - Dec 26 , 2023 | 01:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising