ఎక్కువ కాలం బ్రతకాలనుందా? ఈ సింపుల్ టిప్స్ తో ఆయుష్షు ఫుల్!

ఆరోగ్యం బాగుంటే ఎక్కువ కాలం సంతోషంగా బ్రతకడం సాధ్యం అవుతుంది.

సమతుల్య ఆహారం తీసుకోవాలి.  పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు,  బీన్స్, చిక్కుళ్ళు, పాలు పాల ఉత్పత్తులు శరీరానికి మంచి పోషణను ఇస్తాయి.

ధూమపానం మానేయాలి. అధ్యయనాల ప్రకారం ధూమపానం చేసే వ్యక్తులు 10ఏళ్ల ఆయుష్షు కోల్పోతారు.

నిశ్చలమైన జీవనశైలి వదిలిపెట్టాలి. రోజూ నడక, వ్యాయామం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అప్పుడప్పుడు పచ్చని వాతావరణం మధ్య గడపడానికి ప్రయత్నించాలి.

మద్యపానం తీసుకునేవారిలో కాలేయం, గుండె, ప్యాంక్రియాటిక్ వ్యాధులు సులువుగా వస్తాయి. దీన్ని మానేయాలి.

సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది.   హ్యాపీగా ఉండేవారిని గుండె సంబంధ వ్యాధులు అస్సలు టచ్ చేయలేవు.

పాజిటివ్ మైండ్ అలవరచుకోవాలి. అన్ని విషయాలను సానుకూలంగా  ఆలోచించే వ్యక్తులలో ఒత్తిడి  తక్కువ ఉంటుంది. ఇది మెదడు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.