Share News

Hair Fall: జుట్టు బాగా రాలిపోతోందా? అయితే మీకూ ఈ లోపాలుండటం పక్కా..!

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:30 AM

చాలామందికి తెలియదు కానీ జుట్టు ఎక్కువగా రాలుతున్న వారిలో ఈ లోపాలు ఉంటాయి.

Hair Fall: జుట్టు బాగా రాలిపోతోందా?  అయితే  మీకూ ఈ లోపాలుండటం పక్కా..!

జుట్టు రాలడం అనేది ఇప్పట్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీనికి వయస్సు, జెండర్ తో అస్సలు సంబంధం లేదు. జుట్టు ఎక్కువగా రాలుతున్నప్పుడు దాన్ని నివారించకపోతే అది బట్టతలకు దారితీస్తుంది. ఆ తరువాత జుట్టు పెరుగుదల కోసం ఎంత ప్రయత్నించినా తిరిగి జుట్టు రావడం కష్టమవుతుంది. జుట్టు రాలడానికి ఉన్న ప్రధాన కారణాలలో విటమిన్ లోపాలు కూడా ముఖ్యమైనవి. ఈ కింద విటమిన్లు లోపిస్తే జుట్టు రాలడమనే సమస్య ఖచ్చితంగా వస్తుంది.

విటమిన్-డి(Vitamin-D)

విటమిన్-డి లోపం జుట్టు చాలా పలుచగా మారడానికి దారితీస్తుంది. జుట్టు పెళుసుబారి విరిగిపోతుంది. జుట్టు తొందరగా నెరిసిపోవడానికి కారణం అవుతుంది. దీన్ని రక్తపరీక్ష ద్వారా నిర్థారణ చేసుకోవచ్చు. చేపలు, గుడ్లలో పచ్చ సొన, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం. లేత సూర్యరశ్మిలో గడపడం వల్ల విటమిన్-డి భర్తీ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఎక్కువ కాలం బ్రతకాలనుందా? ఈ సింపుల్ టిప్స్ తో ఆయుష్షు ఫుల్!


విటమిన్-ఎ(Vitamin-A)

విటమిన్-ఎ లోపం వల్ల జుట్టు పలుచబడుతుంది. విపరీతంగా రాలిపోతుంది. తిరిగి జుట్టు పెరగడంలో చాలా జాప్యం అవుతుంది. అదే విధంగా జుట్టులో చుండ్రు అధికమొత్తంలో కనిపించడం వెనుక కారణం ఇదే. విటమిన్-ఎ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను తీసుకుంటే దీన్ని సులువుగానే తిప్పికొట్టవచ్చు.

విటమిన్-ఇ(Vitamin-E)

విటమిన్-ఇ లోపిస్తే తలచర్మం సున్నితంగా మారుతుంది. ఇది జుట్టు కుదుళ్లను, జుట్టు చివర్లను బలహీనం చేసి జుట్టు రాలడానికి కారణం అవుతుంది. విటమిన్-ఇ తక్కువగా ఉంటే పేనుకొరుకుడు, బట్టతల సమస్యలు సులభంగా వస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు, పాలకూర, బాదం, అవకాడో మొదలైనవాటిని తీసుకోవడం ద్వారా విటమిన్-ఇ ని భర్తీ చేయవచ్చు.

విటమిన్-సి(Vitamin-C)

విటమిన్-సి లోపిస్తే జుట్టు పొడిబారడం, జుట్టు చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, జుట్టు పెరుగుదల మందగించడం, పెళుసుగా మారడం జరుగుతుంది. బ్రోకలీ, సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల వీటిని అధిగమించవచ్చు.

ఇది కూడా చదవండి: జీలకర్ర నీళ్లు ఇంత పవరా? ఉదయాన్నే తాగితే జరిగేదిదే..!


ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్-బి9(Vitamin-B9)

విటమిన్-బి9 లేదా ఫోలిక్ యాసిడ్ కణాల పెరుగుదలకు, కణాల విభజనకు సహాయపడుతుంది. పోలిక్ యాసిడ్ లోపిస్తే ఇది కొత్త జట్టు ఉత్పత్తికి కావలసిన కణ విభజనను దెబ్బతీస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుంది. ఆకుకూరలు,సిట్రస్ పండ్లు, కాయధాన్యాలు, బీన్స్ వంటి వాటి నుండి ఫోలిక్ యాసిడ్ పొందవచ్చు.

ఐరన్(Iron)

ఐరన్ లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. ఐరన్ సప్లిమెంట్లతో పాటూ పాలకూర, బీన్స్, బలవర్థకమైన కాయధాయన్యాలు, మునగాకు, రాగులు, నువ్వులు మొదలైనవి తింటూ దీన్ని భర్తీ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: శనగలు, బెల్లం.. ఈ సూపర్ కాంబినేషన్ తింటే కలిగే లాభాలివీ..!

(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్య సమస్యలేవైనా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 11:30 AM