ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Shivakumar: డీకే తాజా వ్యాఖ్యలతో మరింత ఆసక్తిగా మారిన కన్నడ రాజకీయం..

ABN, First Publish Date - 2023-05-15T12:07:37+05:30

కర్ణాటకలో ఎన్నికల్లో (Karnataka Election Results) కాంగ్రెస్ ఘన విజయం (Karnataka Congress) సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో..

బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల్లో (Karnataka Election Results) కాంగ్రెస్ ఘన విజయం (Karnataka Congress) సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి రేసులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య (Karnataka CM Row) ఉన్నారు. ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరిని కర్ణాటక ముఖ్యమంత్రిగా డిసైడ్ చేస్తుందనే విషయం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై డీకే శివకుమార్ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామంతా ఒక ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని, సీఎంను డిసైడ్ చేసే అంశాన్ని పార్టీ హైకమాండ్‌కు వదిలేశామని డీకే స్పష్టం చేశారు. ఢిల్లీకి తాను వెళ్లాలా, వద్దా అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని ఆయన చెప్పారు. తనకు ఏ పని అప్పగించారో ఆ పని పూర్తిచేశానని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధిష్టానం ఇచ్చిన టాస్క్‌ను తాను పూర్తిచేశానని, ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే ఉందనే అర్థం వచ్చేలా డీకే వ్యాఖ్యానించడం గమనార్హం. ఇవాళ తన పుట్టినరోజని, కొన్ని పూజలు చేయాలని డీకే చెప్పారు. తన విశ్వాసం ప్రకారం ఆ పూజలే తనను కాపాడుతాయని డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. కర్ణాటక కాంగ్రెస్‌ కోసం ఏం చేయాలో అవన్నీ చేశానని, బీజేపీ ప్రభుత్వం తనను కేసులతో వేధించినప్పుడు సోనియా, కాంగ్రెస్ ఆదుకున్నాయని తెలిపారు. అధిష్టానానికి ఇప్పటికీ విధేయుడిగా ఉన్నానని సంకేతాలు పంపేలా డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. కర్ణాటక ప్రజలు తనను, కాంగ్రెస్‌ను నమ్మారని డీకే శివకుమార్‌ చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇప్పటిదాకా నెలకొన్న పరిణామాలను ఒక్కసారి పరిశీలిద్దాం..

కౌన్ బనేగా కర్ణాటక సీఎం:

* కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ

* షాంగ్రిలా హోటల్లో ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ

* ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని హైకమాండ్‌కి పంపనున్న పరిశీలకులు

* నేడు ఢిల్లీకి సిద్దరామయ్య, డీకే శివకుమార్

* ఇరు నేతలతో చర్చించి సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న హైకమాండ్

* సీఎం ఎవరనే దానిపై రాహుల్‌, ఖర్గేతో చర్చించాకే తుది నిర్ణయం

* చెరో రెండున్నర ఏళ్ల ప్రతిపాదనకు ఓకే చెప్పిన సిద్దరామయ్య

* ఖర్గే ప్రతిపాదనకు నిరాకరించిన డీకే శివకుమార్‌

* నేడు డీకే శివకుమార్ పుట్టినరోజు

* రాత్రి షాంగ్రిలా హోటల్లో కాంగ్రెస్ నేతల సమక్షంలో కేక్ కట్ చేసిన డీకే శివకుమార్

* కేక్ తినిపించుకున్న డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు

* కర్ణాటక కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

* ఈ నెల 18న కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసే అవకాశం

* అదే రోజున కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం

* హాజరుకానున్న సోనియా, రాహుల్‌, ప్రియాంక

* ప్రమాణ స్వీకారానికి విపక్షాలకు కూడా ఆహ్వానం

Updated Date - 2023-09-09T01:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising