ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: మొసలి కంట్లో పడిన నది ఒడ్డున దుస్తులు ఉతుకుతున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిదంటే..?

ABN, First Publish Date - 2023-08-16T20:09:20+05:30

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నది ఒడ్డున కూర్చొని దుస్తులు ఉతుకుతున్న ఓ మహిళను మొసలి నీటిలోకి లాక్కెళ్లి చంపేసింది.

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నది ఒడ్డున కూర్చొని దుస్తులు ఉతుకుతున్న ఓ మహిళను మొసలి నీటిలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన బుధవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బారీ బ్లాక్ పరిధిలోని పలాత్పూర్ గ్రామంలో జ్యోత్ష్నా జెనా అనే మహిళ బుధవారం స్థానిక నది ఒడ్డును కూర్చుని దుస్తులు ఉతుకుతుంది. అలా దుస్తులు ఉతుకుతున్న మహిళ నదిలోని మొసలి కంటపడింది. మహిళ తన పనిలో నిమగ్నమవగా మొసలి ఆమెపై ఆకస్మాత్తుగా దాడి చేసి నదిలోకి లాక్కెళ్లింది. దీంతో మహిళ మ‌ృతి చెందింది. తీవ్ర గాయాలైన మహిళ మృతదేహం నదిలో తేలియాడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిద్రమైన మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా మహిళ మృతి స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. కాగా ఈ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు ఇది మొదటిసారి ఏం కాదు. జూలై 28న బ్రాహ్మణి నదిలో మొసలి దాడిలో కేంద్రపారాకు చెందిన అమూల్య దాస్ అనే వృద్ధుడు చనిపోయాడు. జూన్ 22న కేంద్రపారా రాజ్‌నగర్ బ్లాక్‌లో పాత్రలు శుభ్రం చేస్తున్న మహిళను మొసలి నదిలోకి ఈడ్చుకెళ్లింది. జూన్ 14న కేంద్రపారాలో తల్లి ఎదుటే ఓ మైనర్ బాలుడిని మొసలి నదిలోకి లాక్కెళ్లింది.

Updated Date - 2023-08-16T20:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising