ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: జగన్‌ ప్రభుత్వంపై జనసేనాని ఫైర్..

ABN, First Publish Date - 2023-03-30T21:07:54+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena President Pawan Kalyan) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena President Pawan Kalyan) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 3 వేల మంది కౌలురైతులు ఆత్మహత్యకు పాల్పడ్డా.. జగన్‌ ప్రభుత్వంలో స్పందన లేదని పవన్ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సాయం చేయడంలోనూ కులకోణం ఏమిటి? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఏపీలో 80 శాతం వరి పంట కౌలు రైతుల సేద్యం నుంచి వస్తున్నదే అని పవన్‌ అన్నారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీతో పవన్ సమావేశమయ్యారు. కౌలు రైతుల స్థితిగతులపై పవన్‌కు ప్రతినిధులు నివేదిక అందచేశారు. రైతాంగ కష్టాలపై త్వరలో జనసేన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోందని, రైతు సమస్యలపై జనసేన పోరాడుతోందని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ఇటీవల చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని పవన్ విమర్శించారు. బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమని పవన్ అన్నారు.

ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని, కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-30T21:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising