Kondru Murali Mohan: వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది
ABN, Publish Date - Dec 30 , 2023 | 08:25 PM
వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) రైతులను దగా చేస్తుందని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్ ( Kondru Murali Mohan ) పేర్కొన్నారు. శనివారం నాడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. విజయనగరం జెడ్పి ఛైర్మన్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో దళారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి శ్రీకాకుళం: వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) రైతులను దగా చేస్తుందని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్ ( Kondru Murali Mohan ) పేర్కొన్నారు. శనివారం నాడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. విజయనగరం జెడ్పి ఛైర్మన్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో దళారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. క్వింటాకు 5 నుంచి 8 కేజీలు మార్జిన్ తీసుకుని రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాకు 3183 రూపాయలు ధర నిర్ణయించినప్పటికి 1500 ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మ బలిదానాలకు సీఎం జగన్ వైఖరి కారణమని మండిపడ్డారు. తేమ శాతం నిర్ధారించటంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కొండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 08:25 PM