ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BalineniSrinivas Reddy: ట్యాపింగ్ అని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా

ABN, First Publish Date - 2023-02-01T14:49:16+05:30

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్‌పై చేసిన వ్యాఖ్యలను వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Nellore Rural MLA KotamReddy Sridhar Reddy) ట్యాపింగ్‌పై చేసిన వ్యాఖ్యలను వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి (YCP Regional Coordinator Balineni Srinivasa Reddy) ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అది కాల్ రికార్డ్ మాత్రమే.. కాల్ రికార్డ్‌ను ట్యాపింగ్ అంటే ఎలా.. అతని ఫ్రెండ్ కాల్ రికార్డ్ చేసి బయటికి పంపారు’’ అని తెలిపారు. ట్యాపింగ్ అని నిరూపిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటానని... ఛాలెంజ్‌కు శ్రీధర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. టీడీపీలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే శ్రీధర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) శ్రీధర్‌రెడ్డి హైదారాబాద్‌ (Hyderabad)లో కలిసి మాట్లాడారన్నారు. ఆనం రామనారాయణరెడ్డి (Anam RamaNarayana Reddy)కి ఎటువంటి భద్రత తగ్గించలేదని తెలిపారు. ఆనం, శ్రీధర్ రెడ్డిలు టీడీపీ(TDP)కి ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నారని.... కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు.. శ్రీధర్ రెడ్డితో ఉన్న చనువుతో కాల్ రికార్డుపై ప్రశ్నించారని బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-02-01T14:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising