ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: లోకేష్‌ను కలిసిన పలు గ్రామాల ప్రజలు

ABN, First Publish Date - 2023-05-05T12:26:45+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర (TDP Leader NaraLokesh) జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేడు 90వరోజు పాదయాత్ర (YuvaGalam Padayatra) పెద్దకొట్టాల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా యువనేతను పలు గ్రామాల ప్రజలు కలిసి తమ సమస్యలు తెలియజేస్తున్నారు. ముందుగా మార్కాపురం గ్రామస్తులు లోకేష్ కలిసి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అరాచకాలను వివరించారు. ఎమ్మెల్యే తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు. దీనిపై మాట్లాడిన లోకేష్... రాష్ట్రంలో వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైందన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నిర్బంధాలు, బెదిరింపులు, భూకబ్జాలు నిత్యకృత్యంగా మారాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

లోకేష్‌ను కలిసిన కురబ సామాజిక వర్గీయులు..

అనంతరం పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురం నేషనల్ హైవేపై లోకేష్‌ను కురబ సామాజిక వర్గీయులు కలిసి వినతిపత్రం సమర్పించారు. యువనేత మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల మేపుకోసం గతంలో కేటాయించిన భూములను వైసీపీ నేతలు ఆక్రమించారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలమేపుకు కేటాయిస్తామని తెలిపారు. 22 గొర్రెలు యూనిట్‌గా సబ్సిడీపై గొర్రెల కొనుగోలుకు రుణాలు ఇస్తామన్నారు. గతంలో ఇచ్చిన జీవోలు, గెజిట్‌లు పరిశీలించి మాదాసి కురవ, మాదారి కురవలకు న్యాయం చేస్తామని చెప్పారు. కంబళ్ల తయారీకి ఉన్నిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

ఎ.గోకులపాడు గ్రామస్తులతో...

అనంతరం పాదయాత్రగా వెళ్తున్న లోకేష్‌ను పాణ్యం నియోజకవర్గం ఎ.గోకులపాడు గ్రామస్తులు కలిశారు. లోకేష్ స్పందిస్తూ... రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేకుండా చేశారన్నారు. గత ప్రభుత్వం తాను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేసినట్లు గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. గోకులపాడులో నిలిచిపోయిన ఎంపీయూపీ స్కూల్, మెటల్ రోడ్డు, డ్రైనేజి, హౌసింగ్ బిల్లులు, పశువుల ఆసుపత్రి సమస్యలను పరిష్కరిస్తామని యువనేత భరోసా ఇచ్చారు.

వక్కెరవాడగుపై బ్రిడ్జి నిర్మిస్తా...

ఆపై టీడీపీ యువనేతను నెరవాడ గ్రామస్తులు కలిసి తమ సమస్యలను విన్నవించగా లోకేష్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు, బ్రిడ్జిల నిర్వహణను గాలికొదిలేశారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి, 61 నిండుప్రాణాలు బలయ్యాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వక్కెరవాడగుపై పటిష్టమైన బ్రిడ్జిని నిర్మించి నెరవాడ గ్రామస్తుల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. నెరవాడ నుంచి కర్నూలు వెళ్లే రహదారిని నిర్మించి, రాకపోకల సమస్య పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-05-05T12:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising