ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: ఆలూరులో లోకేష్ పాదయాత్ర.. సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు

ABN, First Publish Date - 2023-04-19T10:12:15+05:30

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 75వ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 75వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. ఈరోజు ఉదయం వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి 75వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. యువనేత పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. లోకేష్‌ (Nara Lokesh)తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు, యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government) వచ్చిన వెంటనే త్వరితగతిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ లోకేష్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కారుమంచిలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత భేటీ కానున్నారు.

ఈరోజు పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను వలగొండ గ్రామస్తులు కలిశారు. ఆలూరు నియోజకవర్గం వలగొండ గ్రామస్తులు యువనేత లోకేష్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. తమ గ్రామంలో తుమ్మల వంకపై వంతెన ఉందని.. దీనిపై తాము నిత్యం కర్నూలు, బళ్లారి హైవేపై ఆస్పరి గ్రామాలకు ప్రయాణిస్తుంటామని తెలిపారు. పై తరగతులు చదివేందుకు విద్యార్థులు దీనిపైనే ప్రయాణించాల్సి ఉందన్నారు. వర్షాలు పడినప్పుడు మూడు, నాలుగు రోజులు ఈ వంక పొంగుతుందని, ఆ సమయంలో తాము ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. తమరు అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వలగొండ నుంచి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మించాలని వలగొండ గ్రామస్తులు విన్నవించారు.

దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ... రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించే మౌలిక సదుపాయాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైన్లు, వంతెన నిర్మాణాలు, సాగు, తాగు ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి, వలగొండ నుంచి పప్పులదొడ్డి వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని లోకేస్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-19T10:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising