Home » Yuvagalam Padayatra
తన యువగళం పాదయాత్రలో వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోనని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను లోకేశ్ ఆశీర్వదించారు.
ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేశ్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు యువనేత శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
Yuvagalam Book: యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రి లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకంపై లోకేష్‌ను పవన్ అభినందించారు.
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ వడివడిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలతో మంత్రి నారా లోకేష్ శెభాష్ అనిపించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. అసలు ఘట్టానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Andhrapradesh: యువగళం నవశకం బహిరంగ సభకు వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. యువగళం నవశకం బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనుహ్య స్పందన వచ్చిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారన్నారు.
Andhrapradesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర బహిరంగ సభను చరిత్రలో నిలుపుదామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు.
విశాఖపట్నం: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.